ఆం‌దోళనపథంలో ఎపి ఉద్యోగులు

26లోగా సమస్యలు పరిష్కరించాలన్న జేఏసీ ఛైర్మన్‌ ‌బొప్పరాజు
కర్నూలు, ఫిబ్రవరి 6 : ఉద్యోగులు తమ ఆందోళనలను ఉదృతం చేయబోతున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇక వేచిచూసే ధోరణి ప్రదర్శించరాదని అంటున్నారు.  ఈనెల 26వ తేదీలోపు సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదని ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్‌ ‌బొప్పరాజు వెంకటేశ్వర్లు , జగన్‌ ‌ప్రభుత్వానికి డెడ్‌ ‌లైన్‌ ‌విధించారు. ఉద్యోగులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని.. ఈ నేపథ్యంలో ఇక ఉపక్షించేది లేదని, ఉద్యమానికి సిద్ధం కావాలని అన్ని సంఘాలు ముక్తకంఠంతో పిలుపిచ్చాయని బొప్పరాజు అన్నారు. తమకు రావాల్సిన, దాచుకున్న డబ్బులు, సీపీఎస్‌ ‌రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ… ఇలా అనేక సమస్యలను ఈనెల 26వ తేదీ లోపు పరిష్కారం కాని పక్షంలో ఆరోజు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

ఇప్పటికే చాలా వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఏపీ జేఏసీ అమరావతి మూడవ రాష్ట్ర మహాసభలు కర్నూలులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులతోపాటు కాంట్రాక్ట్, ‌హౌస్‌ ‌సోర్సింగ్‌ ఉద్యోగులు కూడా పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా బొప్పరాజు మాట్లాడుతూ మూడున్నరేళ్ల నుంచి తమ సమస్యలు పరిష్కరం కాలేదని, అందులో రెండేళ్లు కరోనా అని తాము కూడా ఏం మాట్లాడలేదన్నారు. గత ఏడాది ఛలో విజయవాడ తర్వాత సీఎం జగన్‌ ఇచ్చిన హాలు.. ఆర్థిక, ఆర్థికేతర.. ఏ సమస్యలు కూడా ఇంత వరకు పరిష్కారం కాలేదన్నారు. తమ ఆవేదన మాటల్లో చెప్పలేమని అన్నారు.

Comments (0)
Add Comment