అమ్మ సంస్థ సేవలు మరువలేనివి

చర్ల మండల పరిధిలోని సుబ్బంపేట గ్రామ పంచయితీ లోగల బి యస్‌ ‌రామయ్య నగర్‌ ఆదివాసీ గ్రామంలో నివసిస్తున్నటువంటి కాక శివకృష్ణ అనే నిరుపేద ఆదివాసి గత మూడు సంవత్సరాలుగా మెడపై ఏర్పడినట •వంటి క్యాన్సర్‌ ‌గడ్డతో బాధపడు తూ రెండుసార్లు ఆపరేషన్‌ ‌నిర్వహిం చిన కూడా పూర్తిస్థాయిలో నయం కాక ప్రతిరోజు నరకం అనుభవి స్తున్నాడు. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున అధ్యక్షులు పీర్ల కృష్ణబాబు  గౌరవ అధ్యక్షుల సవలం పుల్లారావు ఆధ్వర్యంలో బుధవారం కుటుంబాన్ని సందర్శించి మూడు వేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు.

తల్లిదండ్రులు తమకు ఉన్న పశువులను, ఎకరం భూమి, ఉన్న బంగారాన్ని  కొడుకు ఆరోగ్యం బాగుపడాలని అమ్మివేసి వైద్యం చేయించినా కూడా ఫలితం దక్కలేదు ప్రస్తుతం రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న ఆ కుటుంబానికి వృద్ధులైన శివకృష్ణ తల్లిదండ్రులే కూలీనాలీ చేసి పోషించడం జరుగుతుంది. అనారోగ్యంతో ఉన్న కొడుకు, కోడలును వారి ముగ్గురు బిడ్డలను పెంచి పోషించడం తమకు తలకు మించిన భారం అవుతుందని ఆ నిరుపేదలైన తల్లిదండ్రులు వాపోయారు మా కష్టాన్ని చూడలేక ‘‘నాకు విషం పెట్టి చంపేయండి అమ్మా’’ అని ప్రతి రోజు కొడుకు అంటున్న మాటలను భరించలేక పోతున్నామని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యరు దయగల దాతలు శివకృష్ణ కుటుంబానికి తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆ నిరుపేద ఆదివాసి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు ఈ సందర్భంగా విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యనిర్వాహక సభ్యులు కుర్సం లవన్‌ ‌కుమార్‌, ‌లచ్చు పటేల్‌, ‌కోటేశ్వరరావు, పీర్ల రామకృష్ణ, ఉపాధ్యాయులు పర్శిక రమేష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Amma's servicesB S Ramaiah Nagarunforgettable
Comments (0)
Add Comment