తిరుమలలో అఖండ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం

తిరుమల, ఫిబ్రవరి 2 : తిరుమలలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం చేపట్టారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని విష్ణు సహస్ర నామాలను జపించారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్క•త విశ్వవిద్యాలయం, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ, వేదపండితులు, విశేష సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా తిరుమల వేద విజ్ఞాన పీఠం ఆచార్యులు శ్రీమాన్‌ ‌కోగంటి రామానుజాచార్యులు.. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పట్టించడం కలిగే విశేష ఫలితాలను వివరించారు. అనంతరం సంస్క•త విద్యాపీఠం ఉపకులపతి ఆచార్య కృష్ణమూర్తి, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీనాధాచార్యులు.. శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర వైశిష్ట్యాన్ని తెలిపారు. మొదట శ్రీ గురు ప్రార్ధనతో సంకల్పం చెప్పారు. ఆ తర్వాత శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రమ్‌ 30 ‌శ్లోకాలు, పూర్వపీఠిక 29 శ్లోకాలు పారాయణం చేశారు.

అనంతరం విష్ణు సహస్రనామ స్తోత్రం 108 శ్లోకాలను మూడు సార్లు, ఉత్తరపీఠికలోని 34 శ్లోకాలను పారాయణం చేశారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు నారాయణతే నమో నమో.. అనే సంకీర్తన కార్యక్రమం ప్రారంభంలో, చివరిలో శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శ్రీ వెంకటేశ్వర నామ సంకీర్తన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలావుంటే  తిరుమలలో నిర్మించిన పరకామణి భవనంలో ఈ నెల 5 నుంచి కానుకల లెక్కింపు ప్రారంభం కానున్నది. ఉదయం 9 గంటల నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, గోమాత ప్రవేశం, గోపూజ, సుదర్శన హోమం నిర్వహిస్తారు. అనంతరం కానుకలను వేరుచేయడం, లెక్కించడం చేపడతారు. తిరుమల స్వామివారి హుండీ కానుకలు లెక్కించడానికి బెంగళూరుకు చెందిన దాత మురళీకృష్ణ అందించిన రూ.23 కోట్ల విరాళంతో అధునాతన సౌకర్యాలతో పరకామణి భవనం నిర్మించారు.

Akhanda Shri VishnuVishnu Sahasranama Stotra
Comments (0)
Add Comment