వ్యవసాయ చట్టాలు రద్దు ..!

  • ఆమోదం తెలిపిన ఉభయ సభలు 
  • చర్చకు విపక్షాల పట్టు ..అనుమతించని స్పీకర్ 
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ ,నవంబర్ 29: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజు సజావుగా సాగలేదు..విపక్షాల ఆందోళనలతో సభ దద్దరిల్లిపోవటంతో పలుమార్లు వాయిదా పడింది. లోక్ సభలో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం మూజువాణి వోటుతోలోక్ సభ ఆమోదం తెలిపింది. . దేశ ప్రజలు నిర్మాణాత్మక సెషన్ కోరుకుంటున్నారుఅని ప్రధాన మంత్రి  నరేంద్ర  మోడి అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు తొలి రోజు విపక్షాల ఆందోళనలతో వాయిదాల పర్వం అయింది. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు యధావిధిగా ప్రారంభమయ్యాయి. ఇటీవల జరిగిన బైపోల్స్ లో ఎంపీలుగా గెలుపొందిన హిమాచల్ మండ్వ, ఎంపి ప్రతిభా సింగ్, మధ్యప్రదేశ్ కండ్వా ఎంపీ జ్ఒనేశ్వర్  పాటిల్ తో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఈ మధ్య మరణించిన ఎంపీలు, మాజీ ఎంపీలకు లోక్ సభ సంతాపం తెలిపింది. ఆ తర్వాత ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభింస్తున్నట్లు స్పీకర్ సభ్యులకి తెలిపారు. దీంతో ఒక్కసారిగా సభలో గందర గోళం ఏర్పడింది. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఇతర పార్టీలు తమ డిమాండ్లపై చర్చించాలని ఆందోళన చేపట్టాయి. ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ పోడియాన్ని దగ్గర నిలబడి తమ వాదం వినిపించారు. దేశ ప్రజలు పార్లమెంట్ సమావేశాలను వీక్షిస్తున్నారని, వారి ఆంక్షాలకు తగ్గట్లుగా సభ జరిగేందుకు సహకరించాలని సభ్యులను స్పీకర్ కోరారు. విపక్షాలను  వారి ఆందోళన విరమించకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభం కాగానే టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటూ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి అభ్యంతరం తెలిపారు. ఇదే సందర్భంలో సభలో విపక్షాలు, టీఆర్ఎస్ ఎంపీలు తమ డిమాండ్ల పై ఆందోళనకు దిగారు. ఈ గందరగోళం మధ్యే మూడు వ్యవసాయ చట్టాల ఉప సంహరణను ముజూవాణి వోటుతో  లోక్ సభ ఆమోదం తెలిపింది.
రాజ్య సభలోనూ అదే తంతు…
రాజ్య సభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఇటీవల ఎగువ సభకు ఎన్నికైన కొత్త సభ్యులతో ప్రమాణం స్వీకారం చేయించారు. అనంతరం ఇటీవల మరణించిన ఎంపీలు, మాజీ ఎంపీలకు సంతాపం తెలిపారు. చనిపోయిన సభ్యులకు సంతాపంగా గంటపాటు సభను వాయిదా వేశారు. అనంతరం మధ్యాహ్నం 12:19 సభ తిరిగి ప్రారంభం కాగానే…
సభలో విపక్షాల ఆందోళన… వాయిదా పర్వం…
నిత్యావసర ధరల పెరుగుదల, ద్రవ్యోల్బనం, పెగాసెస్,  ఎంఎస్ పి, రైతు పోరాటంలో మరిణించిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం పై విపక్షాలకు స్వల్పకాలిక చర్చకు పట్టుబట్టాయి. కాగా, టీఆర్ఎస్, తెలంగాణ కు చెందిన  కాంగ్రెస్ ఎంపీలు ధాన్యం కొనుగోళ్లపై పోటాపోటీన స్పీకర్, రాజ్య సభ చైర్మన్లకు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. జాతీయ ఆహార ధాన్యాల సేకరణ విధానంపై స్పీకర్ ఓం బిర్లాకు టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత నామా వాయిదా తీర్మానం ఇచ్చారు. ప్యాడి ప్రొక్యూర్మెంట్ లో తెలంగాణ పట్టం కేంద్ర వివక్ష చూపుతోందని రాజ్య సభలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇదే అంశంపై ఎంపి, టీపీసీసీ చీఫ్ రేవంత్ లోక్ సభవ స్పీకర్ కు వాయిదా తీర్మానం అందజేశారు. రైతులు లక్షల టన్నుల ధాన్యంతో కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్నారని తీర్మానం లో పేర్కొన్నారు.  రైతు సమస్యలపై పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు ఆందోళన చెపట్టాయి. ఈ ఆందోళనలో కాంగ్రెస్ చీఫ్ సోనియా, రాహుల్, రేవంత్, ఇతర కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. రైతు చట్టాల రద్దు పై చర్చ జరపాలని టీఎంసీ డిమాండ్ చేసింది.
అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధం : ప్రధాని.
విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకి జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోడి అన్నారు. అన్ని అంశాలపై పార్లమెంట్ లో చర్చించి, సభల ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చలు జరగాలని పిలుపు ఇచ్చారు.  ప్రస్తుత పార్లమెంట్ సెషన్ ఎంతో ముఖ్యమైందని పీఎం అన్నారు. రాజ్యాంగ దినోత్సవ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలన్సిన అవసరం ఉందని, పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ముందు పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మీడియాతో మాట్లాడారు. కలలను సాకారం చేసుకునే దిశలో దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రజలు తమ వంతు సాయం అందించేందుకు ముందుకొస్తున్నారని.. ఇది దేశ ఉజ్వల భవిష్యత్తుకు శుభ సంకేతమని హర్షం వ్యక్తం చేశారు. అయితే, కొత్త వేరియంట్ ను వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో దేశ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
agricultural lawsFirst Day Sessions of Parliamentrepealed
Comments (0)
Add Comment