కరోనా టెస్టులు చేయించుకోనంటున్న నటి

ముంబైలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. బాలీవుడ్‌ ‌స్టార్లు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే అమితాబ్‌ ‌బచ్చన్‌ ‌ఫ్యామిలీకి ఈ వైరస్‌ ‌సోకింది. కాగా తాజాగా అలనాటి స్టార్‌ ‌సీనియర్‌ ‌హీరోయిన్‌ ‌రేఖ బంగ్లాలోని సెక్యూరిటీ గార్డ్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే నటి రేఖ కోవిడ్‌ ‌టెస్టులు చేయించుకోను అంటున్నారు. అలాగే తన ఇంటిని శానిటైజ్‌ ‌చేయడానికి కూడా ఆమె ఒప్పుకోవడం లేదట. ఆమె ప్రవర్తన అధికారులను షాక్‌కి గురిచేస్తుందట. దీనితో ఆ ఇంటిలో ఉంటున్న రేఖతో పాటు సిబ్బంది మొత్తానికి కరోనా టెస్టులు నిర్వహించాలని అన్నారు.

ఆ ఇంటిని కంటోన్మెంట్‌ ‌జోన్‌గా ప్రకటించి, శానిటైజ్‌ ‌చేయడానికి సిద్ధం అయ్యారు. కాగా ఇదే విషయం రేఖ మేనేజర్‌కి ఫోన్‌ ‌చేసి చెప్పగా మేడమ్‌ ‌కరోనా సోకిన వారితో కలిసింది లేదు. కావున ఆమెకు కోవిడ్‌ ‌టెస్ట్ ‌నిర్వహించాల్సిన అవసరం లేదని అన్నారట. అలాగే తన ఇంటిని శానిటైజ్‌ ‌చేయాల్సిన అవసరం లేదన్నారట. దీనితో బ్రహ్మీన్‌ ‌ముంబై కార్పొరేష్‌న్‌ ‌సిబ్బంది ఖంగుతిన్నారట.

Actress Rekha RefusesRekha Refuses to Get Covid-19 Test
Comments (0)
Add Comment