వేషభాషలు వేరైనా
కులమతాలెన్నున్నా
సహనమే సంస్కారంగా
అహింసాపధమే ఆలంబనగా
త్యాగధనుల స్ఫూర్తితో
సంకల్పాల ఛత్రచాయలో
లౌకికవాదం,
స్వతంత్ర న్యాయం,
స్వేచ్ఛా ఎన్నికలు,
వాక్, పత్రికా స్వేచ్ఛ
పంచ ప్రాణాలుగా
ప్రజాస్వామ్యం ఆత్మగా
రాజ్యాంగం మార్గదర్శిగా
సౌరతేజంతో విరాజిల్లుతూ
డెభైనాల్గో పడిలోకి
ప్రవేశించిన
గణతంత్ర భారతమా
నీకు వందనం
పాదాభివందనం…
అమృతోత్సవ గణతంత్రదినాన
సమన్యాయపుజి
ధవళకాంతుల రాదారులపై
ఆనందతాండవమాడుతోన్న
సమైక్య భారతమా
ఓటుబాంకును వదిలి
ప్రతిభామూర్తులను ప్రోత్సహించి
వారిలో నైరాశ్యాన్ని తొలగించుమా!
– వేమూరి శ్రీనివాస్
9912128967
తాడేపల్లిగూడెం