ట్రాక్టర్‌ను ఢీకొన్న ట్రక్‌..‌పదిమంది మృతి

ఉత్తరప్రదేశ్‌ ‌రాజధాని లక్నోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఇంటౌజా ప్రాంతంలో భక్తులతో వెళ్తున్న సమయంలో ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ట్రాక్టర్‌ అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. సీతాపూర్‌లోని అటారియాకు చెందిన ఓ కుటుంబం ఇంటౌజాలోని ఉనై దుర్గాదేవి ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. 30 మంది వరకు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. టికౌలి నివాసి చునీలాల్‌ ‌మౌర్య తన కుటుంబం, బంధువులతో కలిసి నవరాత్రి వేడుకల సందర్భంగా ఉనై దేవి దుర్గా దేవాలయానికి ట్రాక్టర్‌లో బయలుదేరారు.

ట్రాక్టర్‌ 10.30 ‌గంటలకు సీతాపూర్‌ ‌నుంచి ఇంటౌజా-కున్హావ్రా రహదారికి చేరుకోగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్‌ ‌ట్రాక్టర్‌ ‌ట్రాలీని ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌ ‌ట్రాలీ చెరువులో బోల్తాపడింది. అక్కడే ఉన్న స్థానికులు పలువురిని రక్షించి, ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో బాలిక సహా తొమ్మిది మంది మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. దేవీ నవరాత్రుల సందర్భంగా కుటుంబం బంధుమిత్రులతో కలిసి ఆనందంగా భజనలు చేస్తూ వెళ్తుండగా.. క్షణాల్లోనే ప్రమాదం చోటు చేసుకోవడంతో సంఘటనా స్థలం శోకసంద్రంగా మారింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

prajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment