స్వదేశీ ఆత్మగౌరవ ప్రతీక ‘‘చేనేత’’

చేనేత అనేది స్వదేశీ స్వావలంబనకు సంకేతం. ఆత్మగౌరవానికి ప్రతీక. భారత స్వాతంత్ర మహోద్యమంలో చేనేత వస్త్రాలది.. చేనేత కార్మికులది కీలక పాత్ర. నరనరాన దేశభక్తి.. జాతీయత ఉట్టిపడేలా సాగుతున్న స్వాతంత్ర ఉద్యమానికి నాడు ఊతమిచ్చింది మగ్గం. మగ్గంతో తయారయ్యేది కేవలం వస్త్రమే కావచ్చు. కానీ.. విదేశీయుల గుండెల్లో అది శస్త్రమైంది నాడు. ప్రతి భారతీయుడి గుండె గుండెలో జాతీయతను రగిలించిన స్వదేశీ ఉద్యమానికి చేనేత పునాదిగా నిలిచింది. ‘‘విదేశీ వద్దు- స్వదేశీ ముద్దు’’ అనే పిలుపుతో విదేశీ వస్త్రాల బహిష్కరణ పేరుతో సాగిన మహోద్యమం దేశాన్ని ఒక్కటి చేసింది. బానిసత్వాన్ని దూరం చేసి ఆత్మగౌరవాన్ని నింపేందుకు సాగిన స్వాతంత్ర సమరంలో స్వదేశీ ఉద్యమానికి ఆయు పట్టుగా నిలిచింది మగ్గం. ప్రస్తుతం దేశానికి స్వాతంత్రం లభించే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంగా ఆజా దిక అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌పేరుతో దేశమంతా స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటున్న సమయం ఇది. ఈ సందర్భంగా నాటి స్వాతంత్ర పోరాటంలో చేనేత పరిశ్రమ స్వదేశీ ఉద్యమం  పాత్ర కూడా ప్రస్తావించాల్సినటువంటి విషయం తప్పనిసరి.

భారతీయ విలువలు, సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే చీరలు,పంచేల తయారీ లో చేనేత కార్మికుడు తన ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తాడు. మనసుపెట్టి మగ్గం నేస్తాడు. అందమైన రంగులు.. అద్భుతమైన డిజైన్లు.. ఆకట్టుకునే నేత.. సంప్రదాయం ఉట్టిపడే పట్టు.. బంగారం సాక్షాత్కరించే జరితో పోగు పోగును కూర్చి వస్త్రాన్ని తయారు చేస్తాడు కార్మికుడు. ‘‘చరక యంత్రంతో( స్వదేశీ ఉద్యమం) విదేశీ పాలకులకు చురకలు’’ చేనేత చరకతో బ్రిటిష్‌ ‌వారి కుట్రలకు చురకలు బెట్టిన స్వదేశీ ఉద్యమం చాలా పవిత్రమైనది. చరక యంత్రం చూపించి స్వదేశీ మంత్రం వినిపించిన మన జాతీయ స్వాతంత్రోద్యమ నేతలు తెల్లదొరలను గడగడలాడించారు. నూలుపోగులతో మదపటేనుగుల్లంటి అరాచక ఆంగ్లేయులను బంధించారు.  స్వాతంత్ర ఉద్యమానికి.. చేనేత రంగానికి విడదీయరాని అనుబంధం ఉంది. తెల్ల దొరలపై చేసిన ఉద్యమాలు అనేకం. కానీ వాటిలో ప్రముఖమైనవి జాతిని తట్టి లేపినవి ఐదు ఉద్యమాలు.

1)  1905 లో జరిగిన వందేమాతరం దీనినే స్వదేశీ ఉద్యమం అని కూడా అంటారు.
2) ఓం రోల్డ్ ఉద్యమం
3)   సహాయ నిరాకరణ ఉద్యమం
4)  శాసన ఉల్లంఘన ఉద్యమం
5)  క్విట్‌ ఇం‌డియా ఉద్యమం

అయితే క్విట్‌ ఇం‌డియా ఉద్యమంతో దేశానికి స్వతంత్రం లభించింది. అంతకుముందు 1905లో నిర్వహించిన స్వదేశీ ఉద్యమం ఈ ఉద్యమాలన్నింటికీ పునాదివేసింది. లార్డ్ ‌కర్జన్‌ అనే బ్రిటిష్‌ అధికారి బెంగాల్‌ ‌విభజనకు కుట్ర పన్నాడు. దీంతో బెంగాల్‌ ‌విభజనను అడ్డుకునేందుకు స్వదేశీ ఉద్యమం చేపట్టారు. ఇందులో భాగంగా ‘‘విదేశీ వస్త్రాల బహిష్కరణ- స్వదేశీ వస్తువుల ఆదరణ’’ అనే పేరుతో అతివాదులు, మితవాదులు  రెండు పర్యాయాలు ఉద్యమాలు నిర్వహించారు. అందులో తొలి దశ మలిదశ ఉద్యమాలు ఉన్నాయి. బెంగాల్‌ ‌ను తూర్పు బెంగాల్‌- ‌పశ్చిమబెంగాల్‌ ‌గా విభజించేందుకు కుట్రలు చేశారు. బెంగాల్‌, అస్సాం, బీహార్‌, ఒరిస్సా, చోటా నాగపూర్‌ ‌ప్రాంతాల విభజన కోసం బ్రిటిష్‌ అధికారుల కుట్ర పన్నారు. ఈ సందర్భంగా ‘‘విభజించు పాలించు’’ అనే కుట్రను భగ్నం చేస్తూ జాతీయ  స్థాయిలో అఖిల భారత ఉద్యమం నిర్వహించారు. వందేమాతరం( స్వదేశీ) ఉద్యమం పేరుతో దేశంలోని ప్రజలంతా కదిలించారు. ఈ ఉద్యమానికి పంజాబ్‌ ‌ప్రాంతం లో లాలాలజపతిరాయ్‌.. ‌మహారాష్ట్ర ప్రాంతంలో బాలగంగాధర్‌ ‌తిలక్‌.. ‌బెంగాల్‌ ‌నుండి మొదలుకొని ఆంధ్ర ప్రాంతం వరకు బిపిన్‌ ‌చంద్రపాల్‌ ‌నేతృత్వం వహించారు. మిగతా ప్రాంతాలను అరవింద్‌ ‌గోష్‌ ‌పర్యవేక్షించారు. ఈ క్రమంలో లాల్‌.. ‌బాల్‌..‌పాల్‌ అనే త్రయం దేశాన్ని తట్టి లేపింది. ఈ మహోద్యమాన్ని జాతీయోద్యమంగా తీర్చిదిద్దింది. దేశం మొత్తం స్వదేశీ గురించి అనేక పత్రికలలో ఆర్టికల్స్ ‌రాయించారు. బెంగాల్‌ ‌విభజన రద్దు చేయాలని ఏకైక డిమాండ్‌ ‌తో విదేశీ వస్తువులను బహిష్కరించారు. విదేశీ వస్తువులను అమ్మే దుకాణాల వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జాతీయ విద్యా సంఘం ఏర్పాటు చేశారు. దీంతో దేశ ప్రజలలో ఐక్యతను తీసుకొచ్చేందుకు 1905 ఆగస్టు 7న కలకత్తాలో స్వదేశీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడింది. ఆ రోజును ‘‘రక్షాబంధన్‌ ‌దివాస్‌’’ ‌గా హిందూ ముస్లింలు ఐక్యంగా ఉంటూ ఒకరికొకరు రక్షలు కట్టుకున్నారు.

జాతీయ కళాశాలలు ఏర్పాటు చేశారు. గల్లి గల్లిలో పల్లె పల్లెలో వందేమాతర గీతాన్ని ఆలపించారు. దీంతో స్వదేశీ ఉద్యమాన్ని అణచివేసేందుకు వందేమాతర గేయాన్ని బ్రిటిష్‌ ‌ప్రభుత్వం నిషేధించింది. స్వదేశీ ఉద్యమానికి మద్దతుగా ఎటువంటి ఆర్టికల్స్ ‌రాయవద్దని పత్రికలపై ఆంక్షలు విధించింది. 1908లో బాలగంగాధర్‌ ‌తిలక్‌ ‌గారిని మండలి జైల్లో వేశారు. పుల్లర్‌ అని బ్రిటిష్‌ అధికారి హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు పెట్టాడు.  లెక్కలేనన్ని ఆంక్షలు విధిస్తూ నిరంకుశంగా పరిపాలించిన బ్రిటీష్‌ ‌సైన్యంపై భారతీయులు పోరాటం చేస్తూనే ఉన్నారు.  దేశం మొత్తం ఆబాల గోపాలం ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇక చేసేది లేక 1911లో బెంగాల్‌ ‌విభజన రద్దు చేస్తూ బ్రిటిష్‌ ‌ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే లార్డ్ ‌హార్దంజ్‌ అనే అధికారి అప్పటివరకు దేశ రాజధానిగా ఉన్న కలకత్తాను రద్దు చేస్తూ ఢిల్లీని రాజధానిగా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ విధంగా స్వదేశీ ఉద్యమం విజయం సాధించింది. దీంతో బెంగాల్‌ ‌విభజన నిర్ణయాన్ని బ్రిటిష్‌ ‌వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. మొత్తంగా స్వరాజ్యం సాధించడానికి వేసిన తొలి అడుగు స్వదేశీ ఉద్యమమే. ఉద్యమానికి ప్రాణం పోసింది.. ఊపిరి ఊదింది ముఖ్యంగా జాతీయ వాద ఉద్యమానికి వేదికగా నిలిచింది స్వదేశీ వాదమే.!  దేశాన్ని అంతా ఒక్క తాటిపైకి చేర్చిన 1905 ఆగస్టు 7వ తేదీన స్వదేశీ ఉద్యమ నిర్మాణానికి సూచికగా జాతీయ చేనేత దినోత్సవ నిర్వహించుకోవడం శుభ పరిణామం.

చేనేత కార్మికులకు ప్రత్యేక బడ్జెట్‌ ‌కేటాయించాలి
భారత స్వాతంత్రం మహోద్యమంలో ప్రధాన భూమిక పోషించింది స్వదేశీ ఉద్యమమే. కానీ నేడు స్వదేశీ కి చిహ్నమైన చేనేత రంగం చిన్నాభిన్నమైపోతుంది. నాడు ఈస్టిండియా కంపెనీ వచ్చి చేనేత కార్మికుల చేతులు నరికితే.. నేడు ఫ్యాషన్‌ ‌డిజైన్లు పొట్ట కొడుతున్నాయి. కాలం మారింది కానీ నేతల బతుకులు మారలేదు. వ్యవసాయం తరువాత అంతటి ప్రాధాన్యం సంతరించుకున్న సాలె ల మగ్గం సడుగులు విరిగిన సంగతి నేడు మనం చూస్తున్నాం. చేతిలో పని లేక… ఉన్న పనికి తగ్గ వేతనం అందక పస్తులు ఉంటున్న కార్మికుల ఆకలి కేకలు.. ఆత్మహత్యలు.. ఆకలి చావులు నిత్యం మనసులను కకావికలం చేస్తూనే ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో మసకబారుతున్న చేనేత రంగాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నాలు చేయడం అభినందనీయం. 2015 లో ఆగస్టు 7న చేనేతకు గుర్తింపు తెచ్చేందుకు జాతీయస్థాయిలో చేనేత దినం ప్రారంభించడం ప్రశంసనీయం. మసక పడుతున్న చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని.. అందుకు ప్రతి భారతీయుడు చేయుతనివ్వాలని సూచించడం సంతోషకరం. వాతావరణ%శీ% కలుషితమైన నేటి తరుణంలో పర్యావరణ అనుకూలమైన చేనేత ఉత్పత్తుల గురించి ప్రచారం చేయాలని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునివ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం. కుటుంబ వ్యవస్థను కాపాడటంలో చేరతరంగం ప్రాధాన్య సంతరించుకుంది. అధిక శాతం మహిళలు ఉపాధి పొందే రంగాన్ని ‘‘ఖాదీ ఫర్‌ ‌నేషన్‌ ‌ఖాదీ ఫర్‌ ‌ఫ్యాషన్‌’’ అనే నినాదంతో అందరూ మార్గ దర్శకంగా ఉండాలని మోడీ పిలుపునివ్వడంతో యువతలో చేనేత పై మక్కువ పెరిగే అవకాశాలున్నాయి. తద్వారా చేనేత రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్య ఆస్కారం కూడా ఉంది.

‘‘రోజువారి కార్యకలాపాల్లో చేనేత వస్త్రాల వాడకం పెంచితే.. నాటి స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్న అనుభూతి నేటి తరం సొంతం చేసుకోవచ్చు.’’ పల్లె సీమల్లో అధిక శాతం కార్మికులు ఉండే ఈ వ్యవస్థ మన గలిగితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టే అవకాశం ఉంది. అయితే చేనేత ఉత్పత్తులకు జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ప్రాచుర్యం లభించేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చేనేత కార్మికుల జీవన ప్రమాణాల్లో మార్పులు చెందే విధంగా మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, సబ్సిడీల రూపంలో యంత్రాలు.. రుణాలు.. విరివిగా అందజేయాలి. పొద్దస్తమానం ఒక కుటుంబం రెక్కలు ముక్కలు చేసుకుంటే గాని రోజుకు ఒక కార్మికునికి కనీసం 200 రూపాయలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి గిట్టుబాటు కూలి లభించేలా, దళారుల చెర నుంచి కాపాడేలా సహకార సంఘాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే చేనేత ఉత్పత్తులు కొనుగోలు చేయాలి. చేనేత కార్మికుల పిల్లలకు ప్రత్యేక పాఠశాలలు.. వైద్యశాలలు ఏర్పాటు చేయాలి. ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించి నేతన్నలకు అండగా ఉండాలి. నిత్యం పోగుతో పోరాడే కార్మికుడు రోగాల బారిన పడితే కార్పొరేట్‌ ‌స్థాయిలో ప్రభుత్వాలు ఉచిత వైద్యం అందజేయాలి. లేదంటే వచ్చే రోజుల్లో నేత కార్మికుడు పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం పొంచి ఉంది. నేటి ఆధునిక కాలంలో యంత్రాలు నేత కార్మికులను ఇబ్బంది పెడుతున్న సమయంలో చేనేత కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. అందుకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ ‌కేటాయించాలి. ‘‘స్వదేశీ వర్ధిల్లాలి.. చేనేత రంగం బాగుండాలి.’’

– పగుడాకుల బాలస్వామి,  ప్రచార ప్రముఖ్‌
‌విశ్వహిందూ పరిషత్‌ ‌తెలంగాణ రాష్ట్రం
9912975753, 9182674010

chenethaprajatantra newssymbol of indigenoustelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment