గత 24 గంటల్లో 8వేల మందికి పరీక్షలు..!

  • రెండువేల3 వందలా కొరోన కేసులు 56 మరణాలు: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ: గత 24 గంటల్లో ఎనిమిది వేల కోవిడ్ -19 టెస్టులు చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలో ధృవీకరించబడిన కరోనావైరస్ కేసుల సంఖ్య 2301కు పెరిగింది, ఇందులో 56 మరణాలు కోలుకున్న వారిలో 156 మంది ఉన్నారు.

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 8,000 పరీక్షలు జరిగాయి, ఒకే రోజులో ఇదే అత్యధికం అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం COVID-19 పై తన రోజువారీ మీడియా సమావేశంలో తెలిపింది. భారతదేశంలో ధృవీకరించబడిన కరోనావైరస్ కేసుల సంఖ్య 2301 కు పెరిగింది, ఇందులో 56 మంది మరణించారు 156 మంది కోలుకున్నారు. మరణించిన వారి కంటే కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉండటం కొంత ధైర్యాన్ని ఇస్తున్నది అని కేంద్ర ఆరోగ్యశాఖ అన్నది. మహారాష్ట్రలో 423, తమిళనాడులలో 309 కేసులు వరుసగా నమోదయ్యాయి. ఈ రోజు ఉదయాన్నే ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. 21 రోజుల లాక్డౌన్కు సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచానికి ఆదర్శప్రాయమైన ఉదాహరణగా భారత్ నిలిచిందని ప్రధాని అన్నారు.

ఏప్రిల్ 5, ఆదివారం రాత్రి 9 గంటలకు తమ ఇళ్లలోని లైట్లను తొమ్మిది నిమిషాల పాటు ఆర్పివేయాలి అని అటుపై బాల్కనీలలో కొవ్వొత్తులు వెలిగించాలి అని దేశవాసులకు కొత్త విజ్ఞప్తి పిఎం మోడీ చేసారు. లాక్డౌన్ 10 వ రోజులోకి భారత్ ప్రవేశించింది. ఏప్రిల్ 14 న సంపూర్ణ లాక్డౌన్ పూర్తీ అవుతుంది. అటుపై సంపూర్ణ లాక్ డౌన్ ఎలా ఎన్ని దశలుగా ఎత్తివేయాలనే అంశం కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొన్ని దేశాలలో కరోనా వైరస్ రెండవ సారి అటాక్ చేసేలా వున్నది. దీని గురించి ప్రధాని మోడీ ఇప్పటికే రాష్ట్రాలను హెచ్చరించారు. ఏప్రిల్ 15 నుండి విమాన టికెట్స్ బుకింగ్‌లను తిరిగి ప్రారంభించవచ్చని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు, అదే తేదీ నుండి రైల్వే టికెట్లు కూడా జారీ అవకాశం కనిపిస్తోంది. అయితే, అంతర్జాతీయ విమానాలు మాత్రం కరోనా వైరస్ బారిన పడిన దేశాల స్థితి గతుల ఆధారంగా నడుస్తాయి అని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది, కరోనా కేసులు అత్యధికంగా యుఎస్ (244,769), ఇటలీ (115,242) స్పెయిన్ (112,065) నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా మరణాల సంఖ్య 52,973 కు పెరిగింది; ఇటలీలో అత్యధిక మరణాలు (13,915), స్పెయిన్ (10,348), ఫ్రాన్స్ (5,387) ఉన్నాయి.

000 people corona tested8last 24 hours
Comments (0)
Add Comment