డాక్లర్లు, వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే… ఏడేళ్ల వరకు జైలుశిక్ష..!

  • రు .50 వేల నుంచి 2 లక్షల జరిమానా..
  • దవాఖానల పై దాడులు చేస్తే రెట్టింపు పరిహారం వసూలు
  • వైద్యులు, ఆశావర్కర్లు, సిబ్బందికి రూ.50లక్షల బీమా సౌకర్యం
  • కేంద్ర కేబినేట్‌ ‌కీలక నిర్ణయం

లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో కొరోనా బాధితులకు చికిత్స చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని క ఏంద్రం హెచ్చరించింది. వైద్య సిబ్బందికి రక్షణ కల్పించడానికి గాను దాడులను అరికట్టేందుకు త్వరలో ఆర్డినెన్స్ ‌తేబోతున్నట్లు ప్రకటించింది. దాడులకు పాల్పడితే 3 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రదాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినేట్‌లో ఈ అంశంపై చర్చించి ఆర్డినెన్స్ ‌తేవడానికి అంగీకరించింది. లోక్‌ ‌కల్యాణ్‌ ‌మార్గ్ 7‌లోని ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్‌ ‌సమావేశం జరిగింది. కేబినెట్‌ ‌నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ ‌జవదేకర్‌ ‌వెల్లడించారు. కొరోనా, లాక్‌డౌన్‌, ఆర్థిక వ్యవస్థపై చర్చించామని తెలిపారు. డాక్టర్లపై దాడులకు పాల్పడే వారికి బెయిల్‌ ‌కూడా లభించబోదని చెప్పారు. రూ.5వేల నుంచి రూ.2లక్షల వరకు జరిమానా విధిస్తామని జవదేకర్‌ ‌తెలిపారు. తీవ్రంగా గాయపరిచిన కేసుల్లో ఆరు నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష ఉంటుందని, రూ.లక్ష నుంచి రూ.5లక్షల జరిమానా విధిస్తామన్నారు. 30రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని చెప్పారు. దాడులు చేసిన వారి దగ్గరే నష్టపరిహారం వసూలు చేస్తామన్నారు. ఆస్పత్రి ఆస్తులు ధ్వంసం చేస్తే మార్కెట్‌ ‌విలువకు రెట్టింపు జరిమానా వసూలు చేస్తామని చెప్పారు. అలాగే వైద్యులు, ఆశావర్కర్లు, సిబ్బందికి రూ.50లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు జవదేకర్‌ ‌తెలిపారు.

ఇండియన్‌ ‌మెడికల్‌ అసోసియేషన్‌తో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ ‌వివరాలు కేంద్ర •ం మంత్రి అమిత్‌ ‌షా ప్రధానికి వివరించారు. తమకు తగిన రక్షణ కల్పిస్తేనే తాము తలపెట్టిన ఆందోళన విరమిస్తామని ఇండియన్‌ ‌మెడికల్‌ అసోసియేషన్‌ ‌ప్రతినిధులు తనతో చెప్పిన విషయాన్ని కూడా షా మోదీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ విషయంపై లోతుగా చర్చించిన కేంద్ర కేబినెట్‌ ‌వైద్య సిబ్బందిపై దాడి జరిపిన వాళ్లను కఠినంగా శిక్షించాలని, ఇందుకోసం ఆర్డినెన్స్ ‌తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకుడాక్టర్లు, హెల్త్‌వర్కర్లపై దాడి చేస్తే ఇక నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది. హెల్త్ ‌వర్కర్లపై దాడులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నది. 1897 ఎపిడమిక్‌ ‌డిసీజెస్‌ ‌యాక్ట్‌కు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ‌తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. డాక్టర్లపై దాడి చేస్తే ఇక నుంచి దాన్ని నేరంగా పరిగణిస్తారు. కేవలం 30 రోజుల్లోనే విచారణ పూర్తి చేస్తారు. దోషిగా తేలిన వ్యక్తికి మూడు నెలల నుంచి అయిదేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. నిందితులకు 50వేల నుంచి 2 లక్షల వరకు జరిమానా కూడా విధించనున్నారు. ఒకవేళ చాలా తీవ్రమైన దాడి జరిగితే, దానికి మరో విధమైన శిక్షను అమలు చేయనున్నారు. దాడి తీవ్రంగా ఉన్న కేసుల్లో నిందితులకు 6 నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష అమలు చేస్తారు. వారికి లక్ష నుంచి 5 లక్షల వరకు జరిమానా వసూల్‌ ‌చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ ‌జవదేకర్‌ ‌తెలిపారు. మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు హెల్త్‌వర్కర్లు కృషి చేస్తున్నారని, అలాంటివారిపై దాడుల జరగడం దురదృష్టకరమన్నారు. డాక్టర్లు, వర్కర్లపై ఎటువంటి హింసాత్మక దాడికి కానీ, వేధింపులకు పాల్పడినా.. వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమన్నారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఆ ఆర్డినెన్స్‌ను అమలు చేస్తామన్నారు. ఒకవేళ హాస్పిటల్‌ ‌వాహనాలు, క్లినిక్‌లకు జరిగితే, అప్పుడు మార్కెట్‌ ‌విలువ ప్రకారం రెండింతల మొత్తాన్ని వసూల్‌ ‌చేయనున్నారు. విమాన సర్వీసుల పునరుద్దరణపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

దేశవ్యాప్తంగా వైద్యుల ఆనందం:
డాక్టర్లపై దాడికి కఠిన చర్యలు తసీఉకుంటూ ఆర్డినెన్స్‌కు కేబినేట్‌ ఆమోదించడంతో దేశవ్యాప్తంగా ఉన్న వైద్యలు అందరూ మోదీని కీర్తిస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తోన్న డాక్టర్లపై దేశ వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. మరో వైపు కరోనా సోకిన బాధితులకు వైద్యం చేస్తోన్న డాక్టర్లు సైతం కరోనా సోకి చనిపోతున్నారు. మోదీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్‌ ‌సమావేశమైన డాక్టర్లకు రక్షణ కోసం ఆర్డినెన్స్ ‌తీసుకు రావడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇక వైద్యులపై దాడి చేసే రోగులు, రోగుల బంధువులు.. ఇతరులపై కఠినమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. గాయపరిచిన తీవ్రతను బట్టి ఆరు నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.

50 lakh insurance facility for doctorsaspirants and staffAttacks on doctorsJail up to seven yearsmedical staff
Comments (0)
Add Comment