17 ‌నుంచి 26 వరకు శ్రీ భద్రకాళి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు

  • 21న మూలా నక్షత్రం-సరస్వతి పూజ – 24న భద్రకాళీ జన్మోత్సవం, సద్దుల బతుకమ్మ
  • 25న విజయ దశమి, తెప్పోత్సవం – 26న శ్రీభద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణం
  • ఉత్సవాల పోస్టర్‌ ఆవిష్కరించిన మేయర్‌

‌నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ ప్రతిపద్‌ ‌శనివారం నుంచి 26వ తేదీ ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి సోమ వారం వరకు పది రోజుల పాటు వరంగల్‌ ‌మహాన గరంలోని చరిత్ర ప్రసిద్ధి గాంచిన శ్రీభద్రకాళీ దేవస్థానంలో శరన్నవరాత్రోత్సవాలు కోవిడ్‌-19 ‌నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ రామల సునీత, ప్రధానార్చకులు భద్రకాళి శేషులు వెల్లడించారు. ఈమేరకు శుక్రవారం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర మేయర్‌ ‌గుండా ప్రకాశరావు ముఖ్య అతిధిగా పాల్గొని ఉత్సవ పోస్టర్ల ను, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఈఓ సునీత, భద్రకాళి శేషులు మాట్లాడుతూ 17న ఉదయం 4గంటలకు అమ్మవారి నిత్యాహ్నికము, గో బ్రాహ్మణ పూజ, గణపతి పూజ, పుణ్యాహవచనము, అమ్మవారికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో పూర్ణాభిషేకం, నవరాత్ర వ్రతారంభం, అగ్ని ప్రతిష్ట, నవరాత్ర యాగ నిర్వహణ,  శైలపుత్రీ క్రమం, బాలాత్రి పుర సుందరి అలంకారం, చండీ హావనము, ఉదయం 11గంటలకు వృషభ వాహన సేవ, రాత్రి 7గంటలకు యోగా నిద్రా క్రమము మృగ (జింక) వాహన సేవ జరుగుతాయన్నారు.

18న ఆదివారం ఉదయం 4 గంటలకు నిత్యాహ్నికం, అన్నపూర్ణాలంకారం చతు స్థానర్చన, బ్రహ్మచారిణీ దుర్గార్చన, ఉదయం 11గంటలకు మకర వాహన సేవ, రాత్రి 7గంటలకు దేవజా దుర్గార్చన, చందప్రభ వాహన సేవ జరుగుతా యన్నారు.19న సోమవారం 4గంటలకు నిత్యాహ్నికం, గాయత్రీ అలంకారం,ఉదయం 11 గంటలకు సింహవాహన సేవ,రాత్రి 7గంటలకు  మహిషమర్దినీ దుర్గార్చన,గజవాహన సేవ జరుగుతాయి. 20న మంగళవారం ఉదయం 4గంటల కు నిత్యాహ్నికం, శ్రీమహాలక్ష్మి అలంకారం, కూష్మండి దుర్గార్చన, ఉదయం 11గంటలకు సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం7గంటలకు గిరిజా దుర్గార్చన, హంస వాహనసేవ జరుగుతాయి. అలాగే 21న బుధవారం లలితా పంచమి ఉదయం4గంటలకు నిత్యాహ్నిక, లలితా మహాత్రిపుర సుందరి అలంకారం, ఉదయం 11గంటలకు గన్ధోత్సవం, సాయంత్రం 7గంటలకు ధూమ్ర మహా దుర్గార్చన, సాలాభంజిక సేవ మూలా నక్షత్రం సరస్వతీ పూజ జరుగుతా యన్నారు. 22న గురువారం షష్ఠి ఉదయం 4గంట లకు నిత్యాహ్నిక, భవానీ అలంకారం, కాత్యాయనీ దుర్గార్చన,ఉదయం 11గంటలకు పల్లకీసేవ, సాయం త్రం 7గంటలకు చండముండ మహా దుర్గార్చన, శేష వాహనసేవ జరుగుతాయి. 23న శుక్రవారం సప్తమి ఉదయం 4గంటలకు నిత్యాహ్నికం, సరస్వతీ అలం కారం, కాలరాత్రి దుర్గార్చన, సాయంత్రం 7గంటలకు రక్త బీజహా దుర్గార్చన, రధోత్సవం జరుగుతుంది.

అదేవిధంగా 24న శనివారం మహాష్టమి (దుర్గాష్టమి) మహానవమి శ్రీభద్రకాళీ జన్మోత్సవం చద్దుల బతుకమ్మ పండుగ, ఉదయం 4గంటలకు శ్రీ భద్రకాళి దుర్గా అలంకారం, మహాగౌరీ దుర్గార్చన, నిశుంబహ దుర్గార్చన, మహాష్టమి కృత్యం, మహానవమి కృత్యం, డోలోత్సవం, భద్రపీఠ సేవ, ఉదయం 11గంటలకు వృద్ధి హోమం, కూష్మండ బలి ప్రదానం, సాయంత్రం 7గంటలకు సిద్ధి ధాత్రీ దుర్గార్చన, శుంభహా దుర్గార్చన, అశ్వవాహన సేవ, శ్రీభద్రకాళీ జన్మోత్సవ విధి, అమ్మవారికి అభిషేకం, డోలోత్సవం, జాగరణ జరుగుతాయి. 25న ఆదివారం విజయ దశమి (దసరా పండుగ) నిత్యాహ్నికం, కలశోద్వాసన, శ్రీభద్రకాళీ అమ్మవారి నిజరూప దర్శనం, ఆయుధ పూజ,వాహన పూజలు, శమీ పూజ, శ్రీభద్రకాళీ అమ్మ వారి సామ్రాజ్య పట్టాభిషేకం, ఉదయం శరభ వాహన సేవ, చూర్ణోత్సవం, చక్ర స్నానం, ధ్వజా రోహణం, సాయంత్రం 7గంటలకు పుష్పరధ సేవ, శ్రీభద్రకాళీ అమ్మవారి జల క్రీడోత్సవ విధి భద్రకాళి తటాకము నందు ‘‘హంసవాహన తెప్పోత్సవం’’ జరుగుతాయి. అదేవిధంగా 26న సోమవారం ఆశ్వయుజ శుద్ధ ఏకాదశిఉదయం 4గంటలకు నిత్యాహ్నికం, 10గంట లకు కుంభాభిషేకం, రాత్రి 7.30గంటలకు ‘‘శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల కళ్యాణం’’ పుష్పయాగం, నీరా జన మంత్ర పుష్పములు, మహదాశీర్వచనం, తీర్థప్ర సాద వితరణతో ఉత్సవాలు ముగుస్థాయని వారు వివరించారు.

Mahanavami SribhadrakaliMahashtami (Durgashtami)Sharannavarathrotsavam
Comments (0)
Add Comment