‌ప్రగతిభవన్‌లోనా.. ఫామ్‌ హౌస్‌ ‌లోనా.. వనమా రాఘవ ఎక్కడ దాక్కున్నాడో చెప్పాలి

  • పిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ట్వీట్‌
  • ‌రాఘవ సంఘ విద్రోహశక్తిగా మారాడన్న రేణుకాచౌదరి

ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రామకృష్ణ హత్యకేసులో నిందితుడైన వనమా రాఘవను ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ ‌చేయలేదని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు.  కీచక రాఘవ ఎక్కడా.. ప్రగతి భవన్‌ ‌లోనా.. ఫామ్‌ ‌హౌస్‌ ‌లోనా.. అంటూ రేవంత్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. అక్రమాలను ప్రశ్నించే వారిని నిమిషాల్లో అరెస్ట్ ‌చేసే పోలీసులు…. మానవ మృగాన్ని రోజుల తరబడి పట్టుకోలేకపోవడం వెనక ఉన్న రహస్యమేమిటో చెప్పాలన్నారు. దుర్మార్గుడిని కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరన్న ఆయన…ఘటనపై టిఆర్‌ఎస్‌ ‌పెద్దల మౌనానికి అర్థమేంటని ప్రశ్నించారు. ఇదిలావుంటే కొత్తగూడెం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్‌రావుపై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదవి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

వనమా రాఘవ సంఘవిద్రోహ శక్తిగా మారాడన్నారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం నీతులు చెప్పటం మాని.. చేతల్లో చూపించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు చేసిన పనిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. రామకృష్ణ కుటుంబానిది ఆత్మహత్య కాదని..రాఘవ చేసిన హత్య అని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ ‌హాయాంలో మహిళలపై జరుగుతున్న దారుణాలపై ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలని రేణుకా చౌదరి అన్నారు.

prajatantra newstelangana updatestelugu kavithaluToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment