స్వచ్ఛలో మోడల్‌… ‌సిద్ధిపేటకు గోల్డ్ ‌మెడల్‌

  • మంత్రి హరీష్‌రావు సంకల్పం- ప్రజల చైతన్యంతో స్వచ్ఛలో మోడల్‌… ‌సిద్ధిపేటకు గోల్డ్ ‌మెడల్‌
  • సిద్ధిపేట ఖాతాలో 21 ఉత్తమ అవార్డ్‌లు..జాతీయపటంపై స్వచ్ఛ సిద్ధిపేట రెపరెపలు
  • దేశంలో గోల్డ్ ‌మెడల్‌ ‌సాధించిన ఏకైక మునిసిపాలిటీగా ‘పేట’రికార్డు
  • ఇదే స్ఫూర్తితో మరిన్ని అవార్డులు తేవాలని పిలుపునిచ్చిన మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3: ‌స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సంకల్పం…ప్రజల చైతన్యం కలిసి దేశంలో గోల్డ్ ‌మెడల్‌ ‌సాధించిన ఏకైక మునిసిపాలిటీ సిద్ధిపేట రికార్డు సృష్టించింది. అంతేకాకుండా, సిద్ధిపేట పేరు లేనిదే అవార్డు ఉండదు అనే మాటకు మరోసారి దేశ స్ధాయిలో అవార్డులో అగ్రస్థానంలో నిలిచి నిదర్శనం అని చూపింది సిద్ధిపేట. మంత్రి హరీష్‌ః‌రావు ఇచ్చిన స్ఫూర్తి… చైతన్యంతో స్వచ్ఛ సర్వేక్షన్‌-2022‌లో దేశవ్యాప్తంగా 4354 పట్టణాలు ఈ సర్వేలో పాల్గొనగా సిద్ధిపేట పట్టణానికి జాతీయ స్థాయిలో ప్రజల భాగస్వామ్యం విభాగం (సిటిజెన్‌ ‌పార్టిస్పెషన్‌ ‌కేటగిరి)లో లక్ష జనాభా దాటిన పట్టణాలలో సిద్దిపేట మున్సిపాలిటీ జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షన్‌ ‌సర్వేకు 7500 మార్కులు కేటాయించగా అందులో సిద్దిపేట మున్సిపాలిటికి 5540 మార్కులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో లక్ష దాటినా జనాభా విభాగంలో సిద్దిపేట మున్సిపాలిటీ మొదటి స్థానంలో నిలిచింది.

జాతీయ స్థాయిలో 30వ స్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షన్‌ ‌ముఖ్య ఉద్దేశం ఈ సర్వేలో ప్రజలను ప్రోత్సహించి వారికి అవగాహన కల్పించి ప్రజలు కూడా పరిశుభ్రతలో వారి పాత్ర కూడా పోషించేలా, పట్టణ పరిశుభ్రతపై అవగాహన ఏర్పరచుకొని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చూడటం. స్వచ్ఛ సర్వేక్షన్‌ ‌సర్వేలో సర్వీస్‌ ‌లెవల్‌ ‌ప్రోగ్రెస్‌కుగానూ 3000 మార్కులకుగానూ 2559 మార్కులు, ఓడిఎఫ్‌, ‌జిఎఫ్‌సి(గార్బేజ్‌ ‌ఫ్రీ సిటీ) సర్టిఫికేషన్‌ 2250 ‌మార్కులకుగానూ వెయ్యి మార్కులు , సిటిజెన్‌ ‌వాయిస్‌ 2250 ‌మార్కులకుగానూ 1981 మార్కులు సాధించడం జరిగింది. సిద్దిపేట మున్సిపాలిటికి మొట్టమొదటి సారిగా గార్బేజ్‌ ‌ఫ్రీ సిటీ (చెత్త రహిత పట్టణం) స్టార్‌ ‌రేటింగ్‌ ఇవ్వటం జరిగింది. జాతీయ స్థాయిలో 3వ స్థానం రావటానికి మంత్రి హరీష్‌రావు నిత్యం వార్డులలో పర్యటిస్తూ ప్రజలు ఇంట్లో వెలుబడే చెత్తను తడి,పొడి,హానికర చెత్తగా వేరు చేసి ఇవ్వాలని అవగాహన కల్పించగా వారి పిలుపుమేరకు పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా చెత్తను వేరు చేసి ఇవ్వటం. స్వచ్ఛ సర్వేక్షన్‌లో పాల్గొని తమ అభిప్రాయాలను (ఫీడ్‌ ‌బ్యాక్‌),‌స్వచ్ఛత యాప్‌, ‌మై గవర్నమెంట్‌ ‌యాప్‌, ‌మై సిటీ యాప్‌, ‌సిటిజెన్‌ ‌ఫీడ్‌ ‌బ్యాక్‌ ‌యాప్‌, ‌సిటిజెన్‌ ‌ఫీడ్‌ ‌బ్యాక్‌ ‌వెబ్‌ ‌పోర్టల్‌ ‌ద్వారా తమ అభిప్రాయాలను తెలిపి సిద్దిపేటని జాతీయ స్థాయిలో పలు విభాగాలలో నిలిచేలా భాగస్వామ్యమయ్యారు.

ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యం..
అవార్డుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు, అభినందనలు మంత్రి హరీష్‌రావు
సిద్ధిపేటకు మరోసారి దేశ స్థాయిలో అవార్డు రావడం సంతోషంగా ఉందని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈ సందర్భంగా సిద్ధిపేట 10 ఏళ్ల క్రితమే స్వచ్ఛతలో మేటి అని ఎన్నో కార్యక్రమాలు అమలు పరిచి దేశ, రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా నిలిచిందన్నారు. సిద్దిపేటలో దక్షిణ భారత దేశంలోనే రెండవ స్వచ్‌ ‌బడి, ముడు రకాల చెత్త సేకరణ చేస్తున్న ఏకైక మునిసిపాల్టీ సిద్ధిపేట అని చేప్పుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. సిద్దిపేట పట్టణ ప్రజల భాగస్వామ్యంతోనే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. ఈ అవార్డు రావడంలో ప్రజలు చూపిన చైతన్యం గొప్పదని, మునిసిపల్‌ ‌కౌన్సిల్‌, అధికారుల ఐక్యత చూపారని, ఈ సందర్భంగా స్వచ్‌ ‌సర్వేక్షన్‌ ‌భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికీ మంత్రి హరీష్‌రావు పేరుపేరునా అభినందనలు తెలిపారు.

ఇదే స్ఫూర్తితో ప్రతి వార్డులో స్టీల్‌ ‌బ్యాంక్‌ ఏర్పాటు చేసుకున్నామనీ, రాబోయే రోజుల్లో ప్లాస్టిక్‌ ‌రహిత సిద్దిపేటగా దేశంలో తొలి మునిసిపాలిటిగా అవార్డు తెచ్చుకొని ఆదర్శంగా నిలవాలని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. మంత్రి స్పూర్తి.. ప్రజల భాగస్వామ్యం: మునిసిపల్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌మంజులసిద్ధిపేట మునిసిపాలిటీ దేశంలోనే గోల్డ్ ‌మెడల్‌ ‌సాధించిన ఏకైక మునిసిపాలిటీగా రికార్డు సృష్టించిందంటే స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు నిత్య పర్యవేక్షణ, స్ఫూర్తి, ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమైందని మునిసిపల్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌కడవేర్గు మంజుల రాజనర్సు అన్నారు. ఇదే చైతన్యంతో మరిన్ని అవార్డులు సాధించి ఆదర్శంగా నిలుస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. కౌన్సిల్‌కు, మునిసిపల్‌ అధికారులు, సిబ్బందిని అభినందించారు.

కమిషనర్‌ ‌రవీందర్‌రెడ్డి కృతజ్ఞతలు..
జాతీయ స్థాయిలో సిద్ధిపేట పట్టణం నిలిచేలా కృషి చేసిన మంత్రి తన్నీరు హరీష్‌రావు, ఛైర్‌పర్సన్‌ ‌మంజుల రాజనర్సు,వైస్‌ ‌ఛైర్మన్‌ ‌జంగిటి కనకరాజు, కౌన్సిల్‌, ‌కో అప్షన్‌ ‌సభ్యులకు, అన్ని విధాలా సహకరించి స్వచ్ఛ సర్వేక్షన్‌లో పాల్గొన్న పట్టణ ప్రజలకు మునిసిపల్‌ ‌కమీషనర్‌ ‌సిహెచ్‌. ‌రవీందర్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే గోల్డ్ ‌మెడల్‌ ‌సాధించిన ఏకైక మునిసిపాలిటీగా సిద్ధిపేట రికార్డు సృష్టించడం తనకు ఎంతగానో సంతోషంగా ఉందని కమిషనర్‌ ‌రవీందర్‌రెడ్డి అన్నారు.

Model in cleanliness Gold medal for Siddhipet
Comments (0)
Add Comment