రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు

వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

సి.ఎం కెసిఆ ర్‌ ‌రైతు పక్షపాతి అని వ్యవసాయ రంగానికి సర్కారు రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు నిర్మిస్తు పెద్దిపీట వేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలోని వనపర్తి మండలం పెబ్బేరు మండల పరిధిలోని పలు క్లస్టర్‌లలో శనివారం నాగవరం పెద్దగూడెం సవాయిగూడెం చం దాపూర్‌ ‌గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న రైతువేది క భవన నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల రైతులు భౌతిక దూరాన్ని పాటిస్తు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతు రాష్ట్రంలో 60లక్షల రైతు కుటుంబాలను ఏకం చేసే ప్రయత్నం లో భాగంగా రైతు వేదికల నిర్మాణం ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌కల అని అన్నారు. రైతులు సమిష్టి నిర్ణయాలకు ఇవి వేదిక లుగా పనిచేస్తాయని ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి రైతు వేదికలు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. 2604 క్లస్టర్‌లలో రైతుల వేదికల నిర్మాణం తో వ్యవసాయ శాఖ ఉపాధి హామి నిధులతో నిర్మాణం చేపట్టి ఒక్కొక్క రైతు వేదిక 22లక్షల వ్యయం తో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.

జిల్లాలో కొన్ని చోట్ల దాతల సహకారంతో రైతువేదికల నిర్మాణం  పాన్‌గల్‌ ‌వనపర్తి రైతు వేదికలు మా తల్లిదండ్రుల స్మారకంగా సొంత నిధులతో నిర్మాణం చేపడతామని చెప్పారు. రైతు వేదికల నిర్మాణంతో రైతు బంధు సమితిలు క్రియాశీలకంగా ఉంటాయని వచ్చే దసరా నాటికి అన్ని రైతుల వేదికలను ప్రారంభించాలన్నదే ప్రభుత్వ సంకల్పం అని చెప్పారు. వనపర్తి మండలం లో పలు రైతువేదకల నిర్మాణానికి శంకుస్థాపన చేసి పెద్దగూడెం సమీపంలో డబల్‌బెడ్‌ ‌రూం ఇండ్ల నిర్మానాన్ని పరిశీలించారు. అలాగే పెబ్బేరు మండలంలోని రోడ్ల విస్తరణ సెంట్రల్‌లైటింగ్‌ ఏర్పాటుకు అంబేద్కర్‌ ‌చౌక్‌ ‌దగ్గర పార్కు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మెన్‌ ‌లోక్‌నాథ్‌రెడ్డి జడ్పీటిసిలు ఎంపిపిలు, ప్రజాప్రతినిధులు సర్పంచులు, ఎంపిటిసిలు, రైతు సమితి అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment