తల్లిపాలు దివ్యామృతం

తల్లిపాలు శిశువుకు
ఆది అమృతబాండం
తొలి అపూర్వ ప్రాశనం
ప్రథమ ఆరోగ్య ఔషధం

జననీ స్తనము పాలు
బిడ్డ పెరుగుదలకు మూలం
మనో వికాసానికి ఉద్దీపనం

సంపూర్ణ స్వస్థకు సహేతుకం

మాతృమూర్తి ఎద క్షీరం
భగవంతుడు ఇచ్చిన వరం
ప్రకృతి ప్రసాదించిన భాగ్యం
సహజ సిద్ధమైన సంజీవనం

రోగనిరోధక శక్తి స్వరూపం
పోషకపదార్థాల సమాహారం
తల్లిబిడ్డల బంధాల సంధానం

పోతపాలు ఏవైనా సరే !
చనుపాలకు సరితూగవు

కలుషితం కాలేనివి
అంగడిలో దొరకనివి
అమ్మపాలు మాత్రమే !

తల్లి పాలు సేవించిన
శిశువు సర్వదా సుఖఃప్రదం
లేదంటే సుస్థితో సహజీవనం

అందుకే …
తల్లిపాల సుసంస్కృతిని
సామాజిక బాధ్యతగా తలచి
స్వచ్చంధ సహకారం అందించి
స్వస్తత తరాలను తీర్చిదిద్దుదాం

శక్తివంత సమాజాన్ని ప్రతిష్టించి
భారతం బలీయమని చాటుదాం

అమ్మపాల వారోత్సవమేళా
దిగ్విజయవంతంగా జరుపుదాం

(ఆగస్టు 1 నుండి తల్లిపాల వారోత్సవాల సందర్భంగా…)

  – కోడిగూటి తిరుపతి 9573929493

Breastfeeding Week from August 1prajatantra newstelangana updatesTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment