జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ షాక్‌

‌నకిలీ రిజిస్ట్రేషన్ల కుంభకోణం
రూ. 22 కోట్ల ఆస్తులు అటాచ్‌

అనంతపురం,నవంబర్‌30: ‌టీడీపీ సీనియర్‌ ‌నేత జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ షాక్‌ ఇచ్చింది. రూ. 22 కోట్ల ఆస్తులు అటాచ్‌ ‌చేసింది. బీఎస్‌ 3 ‌వాహనాల కుంభకోణం కేసులో ప్రభాకర్‌ ‌రెడ్డి, గోపాల్‌ ‌రెడ్డికి సంబంధించిన ఆస్తులను ఈడీ అటాచ్‌ ‌చేసింది. బీఎస్‌ 3 ‌వాహనాలను నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి బీఎస్‌ 4‌గా మార్చినట్టు ఈడీ గుర్తించింది. నాగలాండ్‌, ‌కర్నాటక, ఏపీలో రిజిస్టేష్రన్స్ ‌జరిగినట్టు గుర్తించింది. ఆర్టీవో అధికారులతో నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్టేష్రన్స్ ‌చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈడీ విచారణ ప్రారంభించింది. అశోక్‌ ‌లేలాండ్‌ ‌నుంచి స్క్రా ‌లో వాహనాలు కొనుగోలు చేసినట్టు గుర్తించింది.

దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ మేరకు ఈడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.మనీలాండరింగ్‌ ‌చట్టం కింద రూ.22.10 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ ‌చేసింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కంపెనీ వ్యవహరాలను చూసే సీ.గోపాల్‌రెడ్డికి చెందిన ఆస్తులు కూడా ఈడీ అటాచ్‌మెంట్‌లోకి వెళ్లాయి. నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించడం, ఆర్డీవో అధికారుల పేరుతో నకిలీ పత్రాలను సృష్టించడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. దివాకర్‌ ‌రోడ్‌లైన్స్, ‌ఝటధార ఇండిస్టీస్‌ ఆస్తులు, సి.గోపాల్‌ ‌రెడ్డి అండ్‌కోకు సంబంధించిన కంపెనీ ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపింది. సుమారు రూ.22.10కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ ‌చేసినట్లు ఈడీ వెల్లడించింది. ‘సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా బీఎస్‌-4 ‌వాహనాల రిజిస్టేష్రన్స్ ‌జరిగాయి.

ఝటధార ఇండిస్టీస్‌, ‌గోపాల్‌ ‌రెడ్డి అండ్‌ ‌కో కంపెనీలు అశోక్‌లేలాండ్‌ ‌నుంచి తక్కువ ధరకే బీఎస్‌-4 ‌వాహనాలను కొనుగోలు చేశాయి. నాగాలాండ్‌, ‌కర్నాటక, ఏపీలో తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్టేష్రన్లు చేయించాయి. రూ.38.36 కోట్ల లావాదేవీలు అక్రమంగా జరిగినట్లు గుర్తించాం అని ఈడీ పేర్కొంది. నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించడం, ఆర్డీవో అధికారుల పేరుతో నకిలీ పత్రాలను సృష్టించడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. వాటి ఆధారంగానే అక్రమ రిజిస్టేష్రన్స్ ‌చేసి కోట్ల రూపాయల పన్నులు ఎగ్గొట్టినట్లు గుర్తించింది. అశోకా లేలాండ్‌ ‌కంపెనీ నుంచి స్క్రాలో వాహనాలను కొని, వాటిని బిఎస్‌ 4 ‌వాహనాలుగా ఝటధార కంపెనీ మార్చినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆస్తులను అటాచ్‌ ‌చేసినట్లు ఈడీ ప్రకటించింది.

Comments (0)
Add Comment