ఆకలి భారతం

రోడ్డు పక్కన అడ్డా మీద
రెక్కల సత్తువ నమ్ముకున్న
బక్కచిక్కిన దేహాల గుంపు
పని కోసం వెతుకుతున్నయ్‌

‌మోడుబారిన చెట్టు కొమ్మపై
దిక్కుమొక్కులేని పసి పిట్టలు
కన్నీటి పాటల పల్లవిస్తున్నయ్‌

‌చిమ్మ చీకటి తెరలు మధ్య
చిత్తం చచ్చిన జీవత్సవాలు
విటులు కోసం నిరీక్షిస్తున్నయ్‌

‌వీధుల్లో ముంగిల్ల ముందర
అన్నార్తులు జీర గొంతుకతో
బిక్షందేహి అని అరుస్తున్నయ్‌

ఈ ‌సుసంపన్న దేశంలో
ఇలాంటి అభాగ్యజీవులెన్నో
మెతుకు పోరు సాగిస్తున్నయ్‌

‌వాళ్ళందరిది
ఒకటే ఆకలి పాట
బతుకు ఊగిసలాట
చావుతో పెనుగులాట

తరాలు తరిగినా
ప్రభుత్వాలు మారినా
వాళ్ళ తలరాత మారలేదు
బతుకు తిప్పలు తప్పలేదు

అయినా..ఇలాంటి
పేదల దినోత్సవాలు
దేశ అమృతోత్సవాలు
ఎంత ఘనంగా జరిపినా

ఇంకా మనది
ఆకలి భారతమే…
అన్నార్తుల రాజ్యమే
 (జూన్‌ 28‌న అంతర్జాతీయ పేదల దినోత్సవం సందర్భంగా..), – కోడిగూటి తిరుపతి :9573929493

Hunger Indiaprajatantra newstelangana updatestelugu kavithaluToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment