అపజయానికి సిద్ధ పడితేనే..
విజయ ద్వారం దొరికి తీరు..
గెలుపుకు నమ్మకమే పునాది !
సదాలోచనలు స్వచ్ఛందంగా రావు
ఈగల్లా గుంపులా ముసురుకోవు
ముక్కోటి చీమల దండులా పాకవు
ఆకాశంలో నల్లని కాకుల్లా ఎగిరిరావు !
రాజహంసల్లా విజయాలోచనలు..
అరుదుగా తాకును మనసుకు
తాకినపుడే ఒడిసి పట్టి గెలువు !
క్షీరసాగర మధనం చివర్లోనే కదా..
ఉబుకును విజయామృతం ధారలు
శక్తి, యుక్తి సమాహారాలే హర్ష చప్పట్లు !
భయాన్ని భయపెడితేనే జయాలు
శ్వేదంతో ప్రతికూలతల్ని పారద్రోలితేనే..
వసంత కోకిల విజయ శంఖారావాలు !
భయపడితే ప్రగతి రథం ఆగిపోయి..
ప్రతికూలతలు పగలబడి నవ్వును..
ఎదురు తిరిగితే పిల్లుల్లా తోక ముడుచు !
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్ – 9949700037