‘‌శ్రీ శోభకృత్‌’‌కు స్వాగతం

‘వెలుపు లేని వేడుక
సమైక్య జీవన వేదిక

ప్రకృతి ఆరాధన దీపిక
సృష్టిని నడిపించే చోదక

నవ వసంత రాగ మాలిక
‘శోభకృత్‌’ ‌నామ వత్సరిక

చైత్ర శుద్ధ పాడ్యమి వేళా
తెలుగువారు జరుపుకునే
ఆది ‘ఉగాది’ మహోత్సవం

ముంగిళ్లను అలంకరించి
నూతన వస్త్రాలు ధరించి

ఆత్మీయ సందేశాలు పంచి
అనురాగ గీతాల ఆలపించి

సబ్బండవర్గాలు నిర్వహించే
సంతోష సంబురాల పర్వం

షడ్రుచుల పచ్చడి అరగిస్తూ
కోయిల గానంతో పరవశిస్తూ

భవిష్య పంచాంగం ఆలకిస్తూ
ప్రకృతి సోయగాలు తిలకిస్తూ

సృష్టితో సంయోగిస్తూ సాగేటి
సంస్కృతిక ధార్మిక ఉత్సవం

ఈ శోభకృత వత్సరంలో
కొత్త జీవితం ఆహ్వానిద్దాం

కోటి ఆశలు ఆశయాలతో
నవోదయవైపు అడుగేద్దాం

సువిశాల హృదయాలతో
సమైక్య ప్రస్థానం సాగిద్దాం

మానవీయ విలువలతో
విశ్వమయ ప్రేమలు పంచి

తెలుగు సంస్కృతి ప్రాశస్తి
జగతిఎల్లెడలా చాటుదాం

(మార్చ్ 22 ‌న ఉగాది పర్వదినం సందర్భంగా…)
– కోడిగూటి తిరుపతి, 9573929493

Comments (0)
Add Comment