శిశిరంలోంచి…

బాధల శిశిరం
చుట్టుముట్టి
పెంచుకున్న
ఆశల పత్రాలన్నీ
ఆశయాల పుష్పాలన్నీ
జీవితం చెట్టు చుట్టూ రాలిపోతూ
భయపెడితేనేం!?
అది కొత్త ఆశల్ని
చిగురింపజేసే
ఆమని రాకకు సంకేతమే కదా!…
నేస్తం…
ఆత్మవిశ్వాసపు
తొలకరి మేఘాలు
వర్షించినప్పుడు
మొగ్గతొడిగన
హృదయ రేకులు
విచ్చుకొని
ఆశల సుగంధాలతో
పరిమళిస్తాయి…
సంకల్పం తూర్పు నుంచి
సరికొత్త కాంతులు
వుద్భవించినప్పుడు
ఆశయాలు
జీవనరశ్మితో
వెలిగిపోతాయి…
 – డాక్టర్‌ ‌కొత్వాలు అమరేంద్ర   9177732414 )

prajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment