వాక్కు విలువ

మితముగా వాడితే
హితము కూర్చేది మాట.
అది వింటుంటే
మనసు నిండాలి,
మీటిన వీణలా
నవరసాలు పలికించాలి.
విలువపెంచే,
నిన్నూ,నన్నూ కలిపే,
వాణ్ణీ, వీణ్ణీ విడదీసే
మాటలనదుపు చేసుకుంటే
ప్రమోదం,
మీరితేజి
జీవితంలో సంతోషం మాయం.
అంతటా రణమే…విధ్వంసమే.

ఓ మనిషీ!
వాక్సుద్ధితోనే వ్యక్తిత్వ వికాశమని
నీకు తెలిసిందేగా.
జీవితం …
హరివిల్లు కావాలంటే,
హాయిగ సాగాలంటే,
నిత్యం పూలజల్లై కురవాలంటే,
పరులతో సంబంధాలు
పటిష్ఠపడిజి
అనుబంధాలు పెంపొందాలంటే,
మాటల మూటలు పంచక
వాటిని కోటలు దాటనీయక
నవనీతంలా భాసించే,
మానవీయతా పరిమళం గుభాళించే
అమృతవాక్కులే సదా పలుకు.
విశ్వాన్నే జయించు.

– వేమూరి శ్రీనివాస్‌, 9912128967, ‌తాడేపల్లిగూడెం

prajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment