రైతు రుణ మాఫీపై స్పష్టత లేదు

  • చెప్పేవి గొప్పలు చేసేది శూన్యం
  • ప్రజలను మోసం చేసే విధంగా బడ్జెట్‌
  • ‌మండిపడ్డ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : ప్రజలను మోసం చేసే బడ్జెట్‌ ‌తీసుకొచ్చారని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బడ్జెట్‌లో డాబుసరి తప్ప ప్రయోజకర అంశాలు లేవన్నారు. రైతాంగానికి రుణమాఫీ నాలుగేళ్లు అయినా చేయలేదని తెలిపారు. అత్యధిక ఎగవేత దలారులుగా రైతులపై ముద్ర పడుతుం దన్నారు. రైతు రుణమాఫీపై ఊసే లేదని..చేస్తారా లేదా స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. అసెంబ్లీ లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బ్జడెట్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌విరుచుకుపడ్డారు. సోమవారం అసెంబ్లీ వి•డియా పాయింట్‌ ‌వద్ద మాట్లాడుతూ…చెప్పేవి గొప్పలు చేసేవీ శూన్యం అన్నట్టుగా బడ్జెట్‌ ఉం‌దంటూ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు వేతనాలు మొదటి తేదీ రాకపోవడంతో ఈఎంఐలు సమయానికి చెల్లించలేకపోతున్నారన్నారు. మధ్యాహ్నం భోజనం వండే వారికి వెయ్యి రూపాయలు ఇస్తున్నారని..అవి కూడా రెండేళ్ళకు ఓ సారి ఇస్తున్నారని విమర్శించారు.

కేసీఆర్‌ ‌కిట్‌కు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదన్నారు. అంగన్‌ ‌వాడీలకు డబ్బు సరిగా ఇవ్వకపోవడంతో ముక్కిపోయిన ఆహారం అందుతుందని బీజేపీ ఎమ్మెల్యే తెలిపారు. బాసర త్రిపుల్‌ ఐటీలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. గురుకులలో సరైన వసతులు లేవని.. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మన ఊరు మన బడి కేవలం చెప్పడానికే రంగురంగులుగా కనిపిస్తుందని వ్యాఖ్యలు చేశారు. ఈహెచ్‌ఎస్‌ ‌పేరుతో ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స ఇవ్వలేమంటున్నారని… హాస్పిటళ్లలో మందులు కూడా అందడం లేదన్నారు. విద్యావాలంటీర్లకు…విదేశీ విద్యకు వెళ్లే వారికి సరైన సమయానికి డబ్బు రావడం లేదని తెలిపారు. కాంట్రాక్టర్లకు ఏ శాఖలోనూ సమయానికి బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్నారని ఈటల రాజేందర్‌ అన్నారు.

Comments (0)
Add Comment