మోదీని ప్రధాని అనాలంటేనే సిగ్గుగా ఉంది

  • రాహుల్‌ ‌సంధించిన ప్రశ్నలనే నేనూ సంధిస్తున్నా
  • కేంద్రమంత్రి కిరణ్‌ ‌రిజిజు..ఓ యూజ్‌లెస్‌ ‌ఫెలో
  • డియా సమావేశంలో కాంగ్రెస్‌ ‌నేత రేణుకా చౌదరి ఫైర్‌

హైదరాబాద్‌, ‌మార్చి 31 : ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రిపై కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకురాలు రేణుకా చౌదరి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆమె డియాతో  మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిరణ్‌ ‌రిజిజు యూజ్‌ ‌లెస్‌ ‌ఫెలో.. లుచ్చా గాడు. నాపై ప్రధాని మోదీ చేసిన వాఖ్యలపై లీగల్‌గా వెళ్ళే ఆలోచనలో ఉన్నాను. యూ హావ్‌ ‌నో హార్ట్ ‌మిస్టర్‌ ‌మోదీ. కాంగ్రెస్‌ ‌యాక్షన్‌ ‌ప్లాన్‌ ఏం‌టో త్వరలోనే తెలుస్తుందని అన్నారు.  రాహుల్‌ ‌గాంధీ మాట్లాడేవన్నీ వాస్తవాలే. రాహుల్‌ అడిగేవాటికి సమాధానం చెప్పాలి. షారుఖ్‌ ‌ఖాన్‌ ‌ముస్లిం కాబట్టే ఆయన కొడుకుపై డ్రగ్స్ అభాండాలు వేసి అదానీ విషయాలు పక్కతోవ పెట్టించారు. అదానీ, మోదీ సంబంధాలపై రాహుల్‌ ‌ప్రశ్నించగానే ఆయన్ని టార్గెట్‌ ‌చేశారు. రాహుల్‌ ‌గాంధీకి ప్రధాని భయపడుతున్నారు. నిజాలు బయట పడుతున్నాయని రాహుల్‌పై కుట్రలు చేస్తున్నారు. మోదీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఫైనాన్షియల్‌ ‌టైమ్స్‌పై పరువునష్టం దావా వేయొచ్చు కదా.

మోదీ భారతదేశ కంఠాన్ని నొక్కుతున్నారు. రాహుల్‌ అడిగిన ప్రశ్నలనే రేణుక చౌదరిగా నేను అడుగుతున్నాను. కేసులు పెట్టినంత మాత్రానా భయపడేది లేదు. మాకు ఎవరూ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని ఘాటు విమర్శలు చేశారు. మోదీని ప్రధాని అనడానికి సిగ్గుగా ఉంది. 56 ఇంచుల చెస్ట్ ఉన్నమనిషికి 70 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కనిపించడం లేదా? మోదీలెవరూ ఓబీసీలు కాదు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఓబీసీకి వ్యతిరేకం కాదు. డ్రెస్సులు మార్చుకునే వాళ్ళకి దేశభక్తి గురించి ఏం తెలుస్తుంది? రాజ్యాంగ విలువలు తెలియని వాళ్ళు కొత్త పార్లమెంట్‌ ‌భవనాలు కట్టి ఏం లాభం? భారత్‌ ‌జోడో యాత్ర కాంగ్రెస్‌ ‌బలోపేతానికి కాదు అని పేర్కొన్నారు. రాహుల్‌ను తొక్కిపెట్టినంత మాత్రాన మోడీ సచ్చీలురు కాలేరని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ‌పక్షాన ప్రజలు ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో గట్టి బుద్ది చెబుతారని రేణుక హెచ్చరించారు.

Comments (0)
Add Comment