‌ప్రోటోకాల్‌ ‌పాటించడం లేదు..సమస్యలు పరిష్కరించడం లేదు…

జగదేవ్‌పూర్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్‌ ‌మండల సర్వసభ్య సమావేశాన్ని ప్రజాప్రతినిధులు బహిష్కరించారు. అధికారులు ప్రోటోకాల్‌ ‌పాటించడం లేదంటూ….గ్రామాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదంటూ నిరసిస్తూ ఎంపిటిసిలు, సర్పంచులు సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు. వివరాల్లోకి వెళ్లితే…శుక్రవారం జగదేవ్‌పూర్‌ ‌మండల పరిషత్‌ ‌కార్యాలయంలో ఎంపిపి అధ్యక్షుడు మెరుగు బాలేషం గౌడ్‌ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ప్రారం‌ప్రోటోకాల్‌ ‌పాటించడం లేదు..సమస్యలు పరిష్కరించడం లేదు…
భం కాగానే…పలువురు ఎంపిటిసిలు మాట్లాడుతూ…సర్వసభ్య సమావేశం సందర్భంగా సంబంధిత అధికారులు ఫ్రోటో కాల్‌ ‌పాటించకుండా ఎంపిటిసిలకు, సర్పంచులకు సరైన సమాచారం ఇవ్వకపోవడమే కాకుండా, గ్రామాలలో ఉన్నటు వంటి సమస్యలు పరిష్కారమయ్యే దిశగా ఉండాలని, గతంలో నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో చర్చించిన సమస్యలు ఇంతవరకు కూడా పరిష్కారం కాకపోవడం పట్ల ఎంపిటిసిలు, సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మండలంలో జరిగే కార్యక్రమాలకు ప్రజా ప్రతినిధులకు సరైన సమాచారం ఇవ్వకుండా ఇష్టానుసారంగా సొంత నిర్ణయాలతో ఒంటెద్దు పోకడతో వెళ్తున్నారని, అలాంటప్పుడు ఎంపిటిసిలు, సర్పంచులు ఎందుకని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల పట్ల అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని, అదే విధంగా మండలంలోని 29 గ్రామాలు ఉంటే ఐదు గ్రామ పంచాయతీల సర్పంచులు మాత్రమే హాజరయ్యారని, మిగతా గ్రామాల సర్పంచులు హాజరు కాకపోవడం వల్ల సమస్యలు ఎలా తెలుస్తాయనీ, ఆయా గ్రామాల సమస్యలు ఎలా పరిష్కారం జరుగుతాయనీ ప్రశ్నిస్తూ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు.

prajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment