- రూ.3936 కోట్లు (91.44 శాతం) వినియోగం
- 142 పురపాలికల్లో మౌలిక వసతుల కల్పన
- దేశానికే ఆదర్శంగా రాష్ట్ర పురపాలక సంస్థలు
హైదరాబాద్, మార్చి 21 : దేశంలో అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందున్నది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రణాళికా యుతమైన పద్దతిలో మౌలిక వసతులు కల్పిం చుటకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షల మేరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. వినూత్న వరవ డితో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు నేతృత్వంలో చేపట్టిన ఈ కార్యక్ర మంతో దేశంలో ప్రామాణిక నగరాలు, పట్టణాలు ఉన్న రాష్ట్రంగా ప్రతి యేటా తెలం గాణకు జాతీయ అవార్డులు అందుతున్నాయి. పట్టణ ప్రగతి కింద ఫిబ్రవరి’20 నుంచి జిహెచ్‌ఎంసి తో పాటు 142 పురపాలక సంస్థలకు రూ.4304 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధుల్లో ఇప్పటివరకు రూ.3936 కోట్లు అంటే దాదాపు 92 శాతం నిధులను పురపాలక సంస్థలు వినియోగిం చుకున్నవి. అందులో జిహెచ్‌ఎంసికి రూ.2276 కోట్లు, మిగిలిన 141 పురపాలికలకు రూ.2028 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనకు పురపాలక సంస్థలకు ఆర్థికంగా చేయుతగా నిలుచుటకు పట్టణ ప్రగతి కింద ప్రభుత్వం నెల నెలా నిధులు ఇస్తున్నది.
అందులో భాగంగా 2022-23లో ఫిబ్రవరి వరకు నెలకు రూ.116 కోట్ల చొప్పున విడుదల చేసింది. ఈ నిధుల్లో జిహెచ్‌ఎంసికి నెలకు రూ.61 కోట్లు, ఇతర (141) పురపాలక సంస్థలకు రూ.55 కోట్ల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. పర్యావరణ పరిరక్షణ, శానిటేషన్ పైన పురపాలక సంస్థలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తుంది. జిహెచ్‌ఎంసి మినహా 141 పురపాలక సంస్థల్లో ప్రతిరోజూ 4,356 టన్నుల చెత్తను సేకరీస్తున్నవి. ఇంటింటికి తిరిగి 100 శాతం చెత్తను సేకరించి, తరలించుటకు కొత్తగా 2165 పారిశుధ్య వాహనాలు కొనుగోలు చేశారు. గతంలో ఉన్న 2548 పారిశుధ్య వాహనాలు ద్వారా రోజుకు 2675 టన్నుల చెత్తను మాత్రమే సేకరించి తరలించేవారు. ప్రస్తుతం పారిశుధ్య చెత్త సేకరణ వాహనాలు సంఖ్య 4713కు పెరుగడంతో శానిటేషన్ పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. సేకరించిన చెత్తను ప్రాసెస్ చేయడానికి 141 పురపాలక సంస్థల్లో మొత్తం 1233 ఎకరాల విస్తీర్ణంలో డంప్ యార్ధులను ఏర్పాటు చేశారు. చెత్తను తడి, పొడిగా విడదీయుటకు 206 డ్రై సోర్స్ కలెక్షన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేశారు. చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చుటకు 229 కంపోస్టు బెడ్స్‌ను నెలకొల్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిహెచ్‌ఎంసి మినహా ఇతర చోట్ల రూ.428 కోట్లతో రోజుకు 2035 కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన 139 మల వ్యర్థాల శుద్ధి ప్లాంట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటిలో 20 చోట్ల పూర్తయినవి.
అలాగే హరిత నిధి కింద ట్రేడ్ లైసెన్స్‌దారుల నుంచి రూ 128 .97 లక్షలు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు నుంచి రూ.14.28 లక్షలు కలిపి మొత్తం రూ.1 కోటి 43 లక్షల 25 వేలు జమ అయ్యాయి. 141 పురపాలక సంస్థల్లో ప్రభుత్వం 453 వైకుంఠదామములను మంజూరు చేసింది. వాటిలో 297 వైకుంఠ దానములు పూర్తయ్యాయి. మరో 149 చోట్ల చేపట్టిన పనులు పురోగతిలో వున్నవి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పర్యావరణహిత, అభివృద్ధి పనులతో తెలంగాణలోని పురపాలక సంస్థలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నవి.
– కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్ వారిచే జారీ చేయనైనది.
– కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్ వారిచే జారీ చేయనైనది.