హైదరాబాద్, పిఐబి, మార్చి 31 : ఓడరేవులు కేంద్ర స్థానంలో నిలబెడుతూ చోటు చేసుకొనేటటువంటి అభివృద్ధి ప్రయాసలకు మరియు ఆర్థిక సమృద్ధి కోసం సముద్రతీర ప్రాంతాలను ఉపయోగించుకునే ప్రయాసలకు నేషనల్ మేరిటైమ్ వీక్ మరింత బలాన్ని జోడిస్తుందన్న ఆకాంక్షను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. నేషనల్ మేరిటైమ్ వీక్ మొదలైన సందర్భం లో ప్రధాన మంత్రి కోటు కు తొలి మేరిటైమ్ ఫ్లాగ్ యొక్క నమూనా ను అలంకరించిన సంగతి ని గురించి కేంద్ర మంత్రి సర్బానంద సొనోవాల్ ఒక ట్వీట్‌లో తెలియజేయగా, ఆ ట్వీట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యుత్తరాన్ని ఇచ్చారు.
నేషనల్ మేరిటైమ్ డేను ఏప్రిల్ 5 వ తేదీన పాటించడం జరుగుతుంటుంది. ఆ రోజున భారతదేశం యొక్క సముద్ర సంబంధి సంప్రదాయం తాలూకు గౌరవప్రద చరిత్రను ఉత్సవం గా జరుపుకొంటారు. ప్రధాన మంత్రి ఒక ట్వీట్‌లో ‘‘మన సమృద్ధమైనటువంటి సముద్ర సంబంధి చరిత్రతో మనకు గల అనుబంధాన్ని నేషనల్ మేరిటైమ్ వీక్ గాఢతరం చేయుగాక. నౌకాశ్రయాలను కేంద్ర స్థానంలో నిలబెడుతూ జరిగే అభివృద్ధికి మరియు ఆర్థిక సమృద్ధికై సముద్రతీర ప్రాంతాలను ఉపయోగించుకునే ప్రయాసలకు ఈ నేషనల్ మేరిటైమ్ వీక్‌తో మరింత బలం లభించు గాక.’’ అని పేర్కొన్నారు.