నేటి నుంచే శోభకృత్‌ ఔషధీయుక్తం ఉగాది పచ్చడి

ప్రకృతి చిగురించే ఈ వసంతకాలాన్ని చెట్లూ, చేమలే కాదు, పశుపక్ష్యాదులు కూడా స్వాగతిస్తాయి. సంవత్సరానికి యుగం అనే పేరు కూడా ఉంది. అందుకే యుగాది అంటారు… కాలక్రమేణా ఉగాది అయింది. చాంద్రమానాన్ని అనుసరించేవారు, సౌరమానాన్ని అనుసరించే ఇంకొందరు ఈ రోజు సంవత్సరాదిని జరుపుకుంటారు. చైత్రమాస శుక్ల పక్ష పాడ్యమి  22 మార్చి 2023 బుధవారం శ్రీ శోభకృత్‌ ‌నామ సంవత్సర ఉగాది. శోభకృత్‌ అం‌టే శోభను కలిగించేది అని అర్థం. అనగా శోభకృత్‌ ‌సంవత్సరం జీవితాలలో వెలుగును నింపేది అని ఉద్యానవనాలన్నీ పూలశోభతో కళకళలాడుతూ ఉండే సంవత్సరమం శ్రీ శోభకృత్‌ ‌నామ సంవత్సరము.  ఉగాది రోజు నువ్వుల నూనె రాసుకుని అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరిస్తారు. భక్తితో భగవంతుడికి నమస్కారం చేసుకుని ఉగాది పచ్చడి తింటారు. సృష్టి మొదలు అయిన రోజు ఉగాది అని విశ్వసించి, సృష్టికి మూలకారకుడైన బ్రహ్మని పూజించి జీవితంలో అన్ని రుచులూ ఉండాలని కోరుతూ షడ్రుచులతో కూడిన పచ్చడిని సేవిస్తారు. ఈ రోజ  పంచాంగ శ్రవణం, తెలుగు వారికే ప్రత్యేకమైన అవధానం, కవి సమ్మేళనం పండుగకు మరింత శోభ తీసుకొస్తాయి.

ఉగాది రోజు ముఖ్యమైన ప్రసాదం  ఔషధీయుక్త  ఉగాది పచ్చడి. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో వివిధ అనుభవాలను సూచిస్తుంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం- తీపి- ఆనందానికి ప్రతీక. ఉప్పు- జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతంబీ వేప పువ్వు- చేదు- బాధకలిగించే అనుభవాలుబీ చింతపండు- పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులుబీ పచ్చి మామిడి ముక్కలు- వగరు – కొత్త సవాళ్లుబీ కారం- సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు.
పచ్చడిలో వాడే ప్రతి పదార్థము మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శరీరం తట్టుకునేందుకు సేవిస్తారు. వేప పువ్వు, మామిడికాయలు, బెల్లం, చింతపండు వంటివి తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవు. వేపలో ఉండే చేదు గుణం వైరస్‌ ‌రాకుండా చేస్తుంది. బెల్లం పిత్త, వాత సమస్యలు లేకుండా చేస్తుం•. చింతపండు జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది. మామిడికాయ శరీరా•నికి వెచ్చదనం తీసుకొస్తుంది. ఇలా ఇన్ని లక్షణాలు కలిగిన వాటిని తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాతావరణాన్ని తట్టుకునేందుకు వాడుతారు.

ఈ మాసం నుంచే క్రమక్రమంగా ఎండలు పెరుగుతాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం అనేక వ్యాధులకు, బాధలకు నెలవుగా మారుతుంది. వాటిని ఎదుర్కోవడానికి ముందస్తుగా తీసుకునే ఔషధమే ఉగాది పచ్చడిగా చెబుతరు. వేపపూతలో గల చేదు శరీరంలోని హ్నిక్ర క్రిములను నాశనం చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధి పరచడమే కాకుండా శ్లేష్మ, వాత సంబంధమైన వ్యాధులను నివారిస్తుంది. ఈ కాలంలో చిన్నపిల్లలకు అంటువ్యాధులు అధికంగా సోకుతుంటాయి. అలాంటి వ్యాధులకు ఔషధంగా వేప  అడ్డుకట్ట వేస్తుంది. అతివేడిమి వలన శరీరంలో గల నియంత్రణ వ్యవస్థ దెబ్బ తినకుండా బెల్లం కాపాడుతుంది.  శరీరానికి అవసరమైన చల్లదనాన్ని అందిస్తూ జీర్ణక్రియకు రక్షణగా నిలుస్తుంది. తీపికోసమేగా అనుకుని బెల్లానికి బదులుగా పంచదార వాడకూడదు. ఎందుకంటే బెల్లంలో ఉండేడే పోషకాలు పంచదారలో వుండవు. బెల్లంతో శరీరంలోకి ఐరన్‌ ‌పెరుగుతుంది.ఉగాది పచ్చడిలో ఉపయోగించే చింతపండు … మిరియాలు .. ఉప్పు, వాత .. పిత్త .. కఫ సంబంధమైన దోషాలను తొలగిస్తాయని శాస్త్రం చెబుతోంది. ఇన్ని ఔషధ గుణాలు కలిగిన ఉగాది పచ్చడి తినడం వలన, వ్యాధులకు లొంగని ధృఢమైన శరీరం ఏర్పడుతుందని దేశీయ వైద్యం స్పష్టం చేస్తోంది. ఆరోగ్యం అందాన్నీ,  ఆనందాన్ని, ఆయుష్షును ఇస్తుంది. అలాంటి ఆరోగ్యాన్ని ఇవ్వడమే ఉగాది పచ్చడిలోని పరమార్థంగా చెబుతారు. శాస్త్రం సూచించిన విధంగా ఉగాది పచ్చడి తినడంవలన ఆనందం, ఆరోగ్యం లభిస్తాయనడంలో సందేహం లేదు.. ఉగాది పచ్చడి. జీర్ణాశయం,శరీరం శుభ్రమవుతుంది. చర్మ సమస్యలను దూరం చేస్తుంది. వేసవి వాతావరణానికి తగ్గట్టు శరీరాన్ని సిద్ధం చేస్తుంది..
– నందిరాజు రాధాకృష్ణ, 98481 28215.

Comments (0)
Add Comment