తెలంగాణను మరింత దగా చేసిన సిఎం కెసిఆర్‌

  • ‌కుటుంబ పాలనతో ప్రజలను వంచించారు
  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు విమర్శ

నీళ్లు, నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్‌ ‌కుటుంబ పెత్తనం సాగిస్తున్నారని మాజీమంత్రి, మంథని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు అన్నారు. తెలంగాణలో ఇప్పుడు బిజెపి,టిఆర్‌ఎస్‌ ‌డ్రామాలు నడుస్తున్నాయని,ప్రజలు వీటిని గమనిస్తున్నారని అన్నారు. ఈ రెండు పార్టీలతో తెలంగాణకు ఒరిగిందేవి• లేదన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ప్రజలు గుర్తించి రానున్న ఎన్నికల్లో పట్టం కడతారని అన్నారు. ఎప్పికైనాకాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కెసిఆర్‌ అవినీతిపై విచరాణ చేయిస్తామని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ‌ప్రజలను నిండాముంచి ఫాంహౌజ్‌కే పరిమితమయ్యారన్నారు. సచివాలయానికి రాకుండా పాలన చేస్తున్న కేసీఆర్‌ ‌మళ్లీ అధికారంలోకి వచ్చినా లాభం లేదన్నారు. ప్రజలను పట్టించుకోకుండా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకోవడం ఆయనకే చెల్లిందన్నారు. సచివాలయం లేదా ప్రగతి భవన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంటానని కెసిఆర్‌ ‌చెప్పగలరా అని శ్రీధర్‌ ‌బాబు ప్రశ్నించారు. తెరాస అధినేత కేసీఆర్‌కు ఇక తెలంగాణ ప్రజలను ఓట్లడిగే నైతిక హక్కులేదని కాంగ్రెస్‌ ‌నేత అన్నారు. కేసీఆర్‌కు ఓట్లే తప్ప పేదల ప్రాణాల పట్టింపులేదని అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రాజెక్టుల పునరాకృతి పేరుతో దోపిడీ చేస్తున్న తెరాస ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు.

ఎనిమిదేళ్ల తెరాస పాలనలో నియంతపాలన సాగించిన కేసీఆర్‌కు ఓటుతోనే బుద్ధి చెప్పాలని అన్నారు. దళితులు, ముస్లింలు, గిరిజనులు, విద్యార్థులు అందరినీ మోసం చేసి రాజకీయ అవినీతికి తెరలేపాడన్నారు. దళితులకు భూమి, రెండు పడకల గదుల ఇళ్లు, సింగరేణిలో కారుణ్య నియామకం ఏదీ జరగలేదన్నారు. తెలంగాణ ప్రజలు దొరహంకారాన్ని భరించరని రాజకీయ మార్పుకోసం కాంగ్రెస్‌ ‌గెలిపించాలని నిర్ణయించుకున్నారని అన్నారు. తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యలు పరిష్కారం కాకపోగా దోపిడీకి గురైందని ఆరోపించారు. తెలంగాణలో యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఇంకా ఉపాధి అవకాశాలు లేక కూలీ పనులు చేసుకునే పరిస్థితి ఉందని వాపోయారు. సింగరేణి భూగర్భ బొగ్గుగనులు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామన్న ముఖ్యమంత్రి ఉపరితల గనులను తవ్విస్తూ బొందల గడ్డలుగా మార్చుతున్నారని మండిపడ్డారు. రామగుండం ప్రాంతానికి మైనింగ్‌ ‌విశ్వవిద్యాలయం ఏర్పాటు, సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయిస్తామని ప్రకటించి ఎందుకు అమలు చేయించలేక పోయారని ప్రశ్నించారు.

prajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment