జయహో..తెలంగాణ బాపూజీ

మహోద్యమాల సారధి
మూడు తరాల వారధి
బడుగు జనుల పెన్నిధి
తెలంగాణం జాతిపిత
కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ

బానిస విముక్తి కోసం
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం
ఉద్యమించిన విప్లవకారుడు

నిజాం నిరంకుశ పాలనపై
నిప్పులు చిమ్మిన యోధుడు

బూర్జువా వ్యవస్థ మీద
ధిక్కార స్వరమెత్తిన ధీరుడు

ముల్కీ ఉద్యమంలో …
స్వతంత్ర సమరంలో …
స్వరాష్ట్ర సాధన రణంలోను
కదం తొక్కి కవాతు చేసినవాడు

పదవి కన్నా ప్రాంతమే మిన్నని
మాత్య పీఠం వీడిన వితరణుడు

తెలంగాణ ఆశయ సాదనే
అహర్నిశలు శ్రమించినవాడు

తొంబయేడేళ్ల వయసు పైబడినా
ప్రజల కోసం పరిశ్రమించినవాడు

జనం పక్షం నిలిచినవాడు
జన స్వరమై నినదించినవాడు
జనం గుండెల్లో మెదిలినవాడు
చరిత్ర పుటలలో మెరిసినవాడు

తెలంగాణ కీర్తి కిరీటం
కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీకి
విప్లవోద్యమ నీరాజనాలు
తెలంగాణ జయ హారతులు

( కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ యాదిలో…)
– కోడిగూటి తిరుపతి, 9573929493

Comments (0)
Add Comment