ఏపిలో మహిళా ఉద్యోగులకు గుడ్‌ ‌న్యూస్‌

అమరావతి, మార్చి 23 : ఆంధ్రప్రదేశ్‌ ‌మహిళా ఉద్యోగులు గుడ్‌ ‌న్యూస్‌ ‌వచ్చేసింది.  వారికి సర్వీస్‌ ‌సమయంలో 180 రోజుల చైల్డ్ ‌కేర్‌ ‌లీవ్‌ ఉం‌టుందన్న విషయం తెలిసిందే. ఇది ఇప్పటివరకు పిల్లలకు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే వినియోగించుకోవాలనే రూల్‌ ఉం‌ది. ఒకవేళ పిల్లలు దివ్యాంగులైతే.. వారికి 22 సంవత్సరాలు వచ్చేవరకు ఈ లీవ్‌ ‌వినియోగించుకునే సౌలభ్యం ఉండేది. తాజాగా జగన్‌ ‌సర్కార్‌ ఆ ‌నిబంధనను తీసేసింది. సర్వీస్‌ ‌టైమ్‌లో ఎప్పుడైనా వినియోగించుకునేలా అవకాశం ఇవ్వాలని అధికారులకు జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మహిళా ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  కాగా గతంలో 60 రోజులు ఉన్న శిశు సంరక్షణ సెలవులను జగన్‌ ‌ప్రభుత్వం గత ఏడాది మార్చిలో 180 రోజులకు పెంచింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అవివాహితుడు (లివ్‌-ఇన్‌ ‌రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు), భార్య చనిపోయిన పురుషుడు లేదా విడాకులు తీసుకున్న వ్యక్తి అయితే, ఒంటరి పురుష ఉద్యోగులకు చైల్డ్ ‌కేర్‌ ‌లీవ్‌ ‌మంజూరు చేయబడుతుంది. అలాగే ప్రైవేటు పాఠశాలల రెన్యువల్‌ ఆఫ్‌ ‌రికగ్నైజేషన్‌ను 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలకు పెంచాలని కోరగా.. దీనిపైనా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.  రెన్యువల్‌ ఆఫ్‌ ‌రికగ్నజైషన్‌ ‌ను ఎనిమిదేళ్లకు పెంచి ఉత్తర్వులు ఇవ్వాలని అధివికారులను ఆదేశించారు. ఇటీవల ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎంపీ రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ ‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలత.. సీఎంను కలిసి ఈ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే క్లియర్‌ ‌చేస్తూ..  ఆమోదముద్ర వేశారు.

Comments (0)
Add Comment