అవ్వ మనాది !

ఉన్న ఊరు పొమ్మన్నది
పొరుగు రాజ్యం రమ్మన్నది

బతుకుదెరువు కొరకు
కానని దేశం బోతివి బిడ్డా!

నువ్వు పొయిన సుంది…
మనసున మన్సు లేదురా

నువ్వాదికచ్చినప్పుడల్ల..
కండ్లు దుఃఖ సెలిమలైనయ్‌

‌కూసింత సప్పుడైనా
అవ్వా అన్న పిలుపు
సెవుల గిల్లుమంటన్నయ్‌

‌మనున్నం అన్నట్టే గనీ
పానమంత నీ మీదనే

అలి ముచ్చట్లు దీర్చక
పోరల గావురం సూడక
దేనికి నోచుకోకపోతివి

కళ్ళ ముందరుంటేనే
గీ ముసలి పానాలకు
మా సంబురం కొడుకా

నీ సేత్తోని అగ్గి బెడితే
పున్నమ లోకంబోతమన్న
తుర్తన్న మిగుల్తాదిరయ్యా !

ఎవ్వలకు గొరగాని
గీ ఎడారి ఎడబాటు
బతుకు మనకెందుకురా

కలైన…గంజయిన
కలిసే పంచుకుందాం

కట్టమైన..సుఖమైన
కలిసే కాలం ఎల్లదీద్దాం
నా మాటిని రార కొడుకా !
నీ రాకకై దారిగాత్త బిడ్డా!!

(వలస బతుకు వెతలకు అక్షరరూపం ఇస్తూ..)
కోడిగూటి తిరుపతి, 9573929493

Comments (0)
Add Comment