Take a fresh look at your lifestyle.

దేశ వ్యాప్తంగా రాజకీయ నేతల్లోనూ.. కొరోనా కల్లోలం

  • రామగుండం, పటాన్‌చెరు ఎమ్మెల్యేలకు పాజిటివ్‌
  • ఏపిలో డిప్యూటి స్పీకర్‌ ‌కోన రఘుపతికి కూడా
  • కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు, కర్నాటక సిఎం యెడ్యూరప్పకు పాజిటివ్‌
  • ‌హాస్పిటల్‌ ‌నుంచి అమితాబ్‌ ‌డిశ్చార్జ్ 

దేశవ్యాప్తంగా కొరోనా కలకలం రేపుతోంది. ప్రధానంగా రాజకీయ నేతలు వైరస్‌ ‌బారిన పడుతున్నారు. అనేకమంది ప్రముఖ నేతలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే పలువురు ప్రముఖులు వైరస్‌తో మృతి చెందారు. బిగ్‌బి అమితాబ్‌ ‌కోలకుని నెగెటివ్‌లోకి రావడంతో హాస్పిటల్‌ ‌నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలోనూ కొరోనా విజృంభిస్తోంది. పలువురు ప్రజాప్రతినిధులు సైతం వైరస్‌ ‌బారిన పడుతున్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కొరోనా పాజటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ‌హైదరాబాద్‌ ‌గచ్చిబౌలిలోని ఓ పైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. సింగరేణి వనమహత్సోవంలో పాల్గొన్న ఎమ్మెల్యే, మేయర్‌కు కొరోనా లక్షణాలు బయటపడ్డాయి. గత వారం రోజులుగా మేయర్‌ •ం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అలాగే పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డికి కూడా వైరస్‌ ‌పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఎమ్మెల్యేతో పాటు ఆయన తల్లి, తమ్ముడు, పీఏ, గన్‌మెన్‌లకు కూడా నిర్దారణ అయింది. ప్రస్తుతం అపోలో హాస్పిటల్‌లో మహిపాల్‌రెడ్డి చికిత్స పొందుతున్నారు. ఇకపోతే ఏపీలో కొరోనా మహమ్మారి విరుచుకు పడుతోంది. ఇప్పటికే వేలల్లో రోజూ కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో కూడా ప్రజా ప్రతినిధులు వైరస్‌ ‌బారిన పడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి అంజద్‌ ‌బాషా సహా దాదాపు పదిమంది ఎమ్మెల్యేలు కొరోనా బారిన పడ్డారు. అందులో చాలా మంది కోలుకున్నారు కూడా.

తాజాగా ఏపీ డిప్యూటీ స్పీకర్‌ ‌కోన రఘుపతికి పాజిటివ్‌ అని నిర్దారణ అయింది. ఆయనతో పాటు ఆయన భార్యకు కూడా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఇప్పటికే మాజీమంత్రి మాణిక్యాల రావు మృతి చెందారు. ఇకపోతే దేశవ్యాప్తంగా కూడా వైరస్‌ ‌పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. కొరోనా మహమ్మారి సామాన్య ప్రజలతోపాటు సినీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులను వదలడం లేదు. ఇప్పటికే పలు ఎమ్మెల్యేలు, మంత్రులు కొరోనా బారినపడ్డారు. తాజాగా కాంగ్రెస్‌ ‌మాజీ మంత్రి చిదంబరం కుమారుడు, శివగంగ ఎంపీ కార్తీ చిదంబరం వైరస్‌ ‌బారిన పడినట్లు సోమవారం తెలిపారు. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ ‌యెడియూరప్పకు ఆదివారం కొరోనా పాజిటివ్‌గా నిర్దారణ కాగా చికిత్స కోసం బెంగళూరులోని మణిపాల్‌ ‌హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా యెడ్యూరప్ప కుమార్తెకు సైతం వైరస్‌ ‌సోకినట్లు తేలింది. దీంతో ఆమెను చికిత్స కోసం బెంగళూరులోని మణిపాల్‌ ‌హాస్పిటల్‌లో చేర్పించారు. కాగా సీఎం యెడియూరప్ప సైతం అదే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రత్యేక వైద్య బృందం ఎప్పటికప్పుడు ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తోందని హాస్పిటల్‌ ‌వర్గాలు తెలిపాయి. కర్ణాటక మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్‌ ‌నేత ఇవాన్‌ ‌డిసౌజా, ఆయన భార్యకు శనివారం కొరోనా సోకిన విషయం తెలిసిందే. అదే విధంగా కాంగ్రెస్‌ ‌నేత, మధ్యప్రదేశ్‌ ఎమ్మెల్యే పీసీ శర్మ కూడా ఇటీవల వైరస్‌ ‌బారినపడ్డారు. కాగా కేంద్ర •ంమంత్రి అమిత్‌ ‌షా, తమిళనాడు గవర్నర్‌ ‌భన్వరీలాల్‌ ‌పురోహిత్‌(80), ఉత్తరప్రదేశ్‌ ‌బీజేపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ ‌సింగ్‌, ‌మధ్యప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి శివరాజ్‌ ‌సింగ్‌ ‌చౌహాన్‌ ‌కొరోనా బారిన పడగా.. యూపీ సాంకేతిక విద్యా శాఖ మంత్రి కమల్‌రాణి (62) కోవిడ్‌తో మరణించిన విషయం విదితమే. డాక్టర్ల సలహాతో హాసిటల్‌లో చేరానని అమిత్‌ ‌షా ట్వీట్‌ ‌చేశారు. ఇప్పుడు తన ఆరోగ్యం నిలకడగా ఉందని, గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా స్వీయ నిర్భంధంలో ఉండాలని అమిత్‌ ‌షా విజ్ఞప్తి చేశారు. కాగా కొరోనా పాజిటివ్‌గా తేలడంతో 15 రోజుల క్రితం ముంబయిలోని నానావతి హాస్పిటల్‌ ‌నుంచి అమితాబ్‌ ‌బచ్చన్‌ ‌డిశ్చార్జీ అయి ఇంటికి వెళ్లారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply