నర్సంపేట, : అమ్మానాన్న, గురువు దైవంతో సమానమని శ్రీ చైతన్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు కళ్యాణి అన్నారు. పట్టణ కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో శ్రీ శతశతకవి చిగురుమల్ల శ్రీనివాస్ రచించిన అమ్మానాన్న గురువు పద్యరచనలో శతక పద్యాలను సామూహిక గానం చేస్తూ గిన్నిస్ రికార్డులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు మంచి భవిష్యత్తులో ఉండాలంటే అమ్మానాన్న గురువులను దైవంగా పూజించి మంచి మార్గాన్ని ఎంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డిఎన్ రాజ్ కుమార్, విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీధర్, మహేష్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Tags: Ammanna Guru, equals Divine,sri chaitanya school