Take a fresh look at your lifestyle.

యథావిధిగా 27న అమ్మ ఒడి పథకం : మంత్రి బొత్స

విజయనగరం, జూన్‌ 23 :  ఈ ‌నెల 27న అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహిస్తామని, ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి చేతుల దగా తల్లుల అకౌంట్లలోకి నగదు జమ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గతంలో 32 శాతం మాత్రమే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివేవార న్నారు. వైఎస్సార్‌సీపీ  ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల సంఖ్య 65 శాతానికి పెరిగిందన్నారు. అమ్మ ఒడి లబ్దిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తవమన్నారు. అటెండెన్స్ ఆధారంగా లబ్ది చేకూరుతుంద న్నారు. పిల్లలను సక్రమంగా స్కూల్‌కు పంపితేనే పథకం వర్తిస్తుందన్నారు.

రూ.2 వేలు అనేది పాఠశాల నిర్వహణ కోసం ఖర్చు చేస్తాన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో అధ్యాపకులు కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స తెలిపారు.ఇంటర్‌ ‌ఫలితాలుగత ఫలితాలు కంటే మెరుగ్గానే ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.  ఆయన డియాతో మాట్లాడుతూ.. అమ్మ ఒడి లబ్దిదారుల సంఖ్య తగ్గడం అవాస్తవమని తెలిపారు. అటెండన్స్ ఆధారంగా లబ్ది చేకూరుతుందన్నారు. పిల్లలను సక్రమంగా స్కూల్‌కి పంపితేనే పథకం వర్తిస్తుందన్నారు.

రెండు వేల రూపాయిలు కోత అనేది పాఠశాల నిర్వహణ కోసం ఖర్చు చేస్తామన్నారు. ఉపాధ్యాయ కొరతపై ఆయా సంఘాలతో చర్చలు జరుపుతామని బొత్స వెల్లడించారు. స్కూల్స్, ‌కాలేజీల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

- Advertisement -

Leave a Reply