Take a fresh look at your lifestyle.

అమ్మా నాకెందుకో భయం వేస్తుంది

నా భయమంతా నాన్నతోనే
గడపదాటిన నాన్నను ఏ రూపంలోనైనా
కరోనా అంటుకుంటే ఎలా అమ్మా..
దినదినమో గండమవుతుంది..
ఎలా తెల్లారుతుందోననే నా భయం
తెల్లవారేకల్లా ఎన్నో పీడకలలు
హఠాత్తుగా ఏదో జరిగిపోయినట్టు..
ఎవడో చేసినందుకు మనకెందుకమ్మ శిక్ష
కనిపించని ఆ శత్రువుతో
కని పెంచుకున్నవాళ్లకు బాధలు..
నిత్యం భయపెడుతూ దొరికినవాళ్లను కాటేస్తుంది
గడియగడియకో గండం..
వినిపిస్తున్నాయి కరోనా చావుకేకలు
పెరుగుతున్నాయి శవాల గుట్టలు
అమ్మా నీవు చెప్పినట్లే వింటాను
గడపదాటితే నీ మీద ఒట్టే
కాని నాన్నను గడపదాటి వెళ్లనీయకు
మన ఇంటికి ఎవరిని రానియకు
ఇకనుండి ఎదురుపడిన ప్రతి
వారిని అనుమానించాల్సిందే
అక్కో దగ్గర, నేనోదగ్గర ఉండిపోయామనే
బాధలేదు
నా బాధంతా అంతా మంచిగుండాలనే..
అందరం మంచిగుండాలంటే కరోనా వైరస్‌సు అరికట్టాలి
ఆ వైరస్‌సు అరికట్టాలంటే స్వీయనియంత్రనే మార్గం
ఆందోళన చెందకుండా అరికడుదాం కరోనాను..

– కూతురు రాజిరెడ్డి, సిద్ధిపేట

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!