Take a fresh look at your lifestyle.

కరోనా నుంచి కోలుకుంటున్న అమితాబ్‌…

ప్రస్తుతం అమితాబ్‌ ‌బచ్చన్‌, ఆయన తనయుడు కరోనాతో ముంబై నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దీంతో వీరి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఇద్దరూ చికిత్సకు చక్కగా స్పందిస్తున్నారని పేర్కొన్నారు.బాలీవుడ్‌లో కరోనా కలకలం రేపుతోంది. రోజురోజుకు ఇండస్ట్రీలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. బిగ్‌ ‌బి అమితాబ్‌ ‌బచ్చన్‌, ఆయన కుమారుడు అభిషేక్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే.

దీంతో వారిద్దరూ ప్రస్తుతం ముంబై నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందన ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.  బిగ్‌ ‌బి కోడలు ఐశ్వర్యా రాయ్‌, ‌మనవరాలు ఆరాధ్యలకు కూడా పాజిటివ్‌ ‌వచ్చినా, ఇద్దరూ ఇంటి వద్దే ట్రీట్‌మెంట్‌ ‌తీసుకుంటున్నారు. అమితాబ్‌, అభిషేక్‌ ‌చికిత్సకు చక్కగా సహకరిస్తున్నారని, ఇద్దరు కోలుకుంటున్నారని, మరో వారం రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని డాక్టర్లు పేర్కొన్నారు.

Leave a Reply

error: Content is protected !!