అమిత్‌షా హైదరాబాద్ సభ రద్దు
హైదరాబాద్‌లో అమిత్ షా సభను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. సీఏఏకు అనుకూలంగా ఈ నెల 15న జరగాల్సిన సభ మళ్లీ ఎప్పుడు జరిగేది ప్రకటిస్తామని అన్నారు. ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని తొలుత తెలంగాణ బీజేపీ తలపెట్టింది. దీనికి అమిత్ షాను ఆహ్వానించగా ఆయన సమ్మతించారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌కు బీజేపీ అధ్యక్షుడు లక్ష్మన్ కూడా ఆహ్వానం పంపారు. దానికి జనసేనాని కూడా అంగీకరించారు. దాంతో పవన్, అమిత్‌షాలు కలిసి పాల్గొనే తొలి సభకు ఎల్బీ స్టేడియం వేదిక అవుతుందని అందరూ భావించారు. తాజాగా ఒకవైపు పార్లమెంటు సమావేశాలు.. ఇంకోవైపు కరోనా వైరస్ నియంత్రణపై దృష్టి.. ఇలా రెండు కీలకాంశాలు ముందున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు రాలేనని అమిత్‌షా స్థానిక బీజేపీ నేతలకు వర్తమానం పంపారు. దాంతో మొత్తం సభనే రద్దు చేస్తున్నట్లు బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు.
పార్లమెంటు సమావేశాలకు, కరోనా వైరస్ భయం తోడవడం.. ఆ రెండంశాల్లో కేంద్ర ప్రభుత్వం తలమునకలై వుండడంతో అమిత్ షా హైదరాబాద్ సభకు రావడం లేదని వెల్లడించారాయన. త్వరలోనే మరోతేదీని ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.పవన్ కల్యాణ్‌తో కలిసి పాల్గొనే బహిరంగ సభను కేంద్ర •ం శాఖా మంత్రి అమిత్‌షా రద్దు చేసుకున్నారు. సీఏఏకు అనుకూలంగా హైద రాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో అమిత్‌షా పవన్ కల్యాణ్‌తో వేదికను షేర్ చేసుకుంటారని అంతా భావించగా.. ఆ సభకు రావడం లేదని అమిత్‌షా బుధవారం ప్రకటించారు. ఇటీవల జనసేన, బీజేపీల మధ్య స్నేహం చిగురించిన నేపథ్యంలో ఈ సభలో నేతలిద్దరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా వుంటారని భావించగా.. అమిత్‌షా సడన్ డెసిషన్ రెండు పార్టీల శ్రేణులను అవాక్కయ్యేలా చేసింది.