Take a fresh look at your lifestyle.

స్వామివారి కల్యాణానికి అమిత్‌షా రాక

భద్రాచలం, మార్చి 27(ప్రజాతంత్ర ప్రతినిధి) : ఏప్రిల్‌ 10‌వ తేదీన జరుగనున్న  భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవానికి కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌షా రానున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం కేంద్రం నుండి త్వరలో సంబంధిత అధికారులకు ఆదేశాలు రానున్నట్లు తెలుస్తుంది. భద్రాచలంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించ తలపెట్టిన కాటేజ్‌లకు శంఖుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భదాద్రికి ప్రత్యేక నిధులు సమకూర్చి అభివృద్ది చేసేందుకు ప్రధానమంత్రి మోడీ ప్రత్యేకంగా హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌షాను స్వామివారి కల్యాణానికి పంపిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం భదాద్రి రామాలయం అభివృద్ధికి వంద కోట్లు కేటాయించి మూడేళ్ళు గడుస్తున్నా నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఇది దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులతో దక్షిణ అయోధ్యగా పేర్కొంటూ అభివృద్ధి చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. భదాద్రిలో ఉన్న  సమస్యలను పరిశీలించేందుకు ఇటీవలే యాంటి టెరరిస్ట్ ‌చైర్మన్‌ ‌బిట్టా పర్యటించారు.

Leave a Reply