Take a fresh look at your lifestyle.

మార్చి మూడు.. నాలుగు తేదీలలో అమిత్ షా తిరుపతి పర్యటన..

  • త్వరలో తేలనున్న బీజేపీ..జనసేనల మైత్రి రోడ్ మ్యాప్..
  • పవన్ కళ్యాణ్ అమిత్ షాల సమావేశంలో ఇరు పార్టీల మైత్రి ఎలా కొనసాగాలి అన్నదాని పై చర్చ…
  • రెండో ప్రయారిటీగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ: అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు జనసేన బీజేపీ పార్టీల మైత్రి రోడ్డు మ్యాప్ ఎలా ఉండాలి అన్నది నిర్ణయిస్తామని పవన్ కళ్యాణ్ మీడియాకి తెలిపారు.రానున్న సమయంలో మరీ ముఖ్యంగా ఎలక్షన్ సమయం సరికి బీజేపీ..జనసేనల వ్యవహార శైలి, వ్యూహాలు ఎలా ఉండాలి అనేదానిపై ఒక క్లారిటీకి వస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. అమిత్ షా తిరుపతి పర్యటనలో ఇరు పార్టీల మైత్రి నేపథ్యంలో అనుసరించాల్సిన రాజకీయ ఎత్తుగడలు గురించి చర్చించుకునేందుకు ప్రస్తుత ఢిల్లీ టూర్ లో ఓకే ప్రాధమిక అవగాహనకి వచ్చామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.

 

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయన తో పాటు నాదెండ్ల మనోహర్ కలిశారు. కేంద్రం అమలు చేస్తున్న డిజిన్వెస్ట్మెంట్ పాలసీ ప్రకారం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయటం వలన బీజేపీ..జనసేనలకి రాజకీయంగా నష్టం అని అమిత్ షాకి తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజల సెంటిమెంట్లు ఉన్నాయి అని మంత్రి అమిత్ షాకి తెలిపారు. 32 మంది బలిదానాలు తర్వాత ఆంధ్రలో స్టీల్ ప్లాంట్ వచ్చిన నేపథ్యంలో ఈ స్టీల్ ప్లాంట్ పట్ల ప్రజలకు ప్రత్యేకమైన సెంటిమెంటు ఉన్న దరిమిలా ఈ స్టీల్ ప్లాంట్ ను కేవలం ఒక ఉక్కు కర్మాగారం గా చూడవద్దని పవన్కళ్యాణ్ కోరారు. నేరుగా 18వేల మంది స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు చేస్తున్నారని అలాగే 20 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి ఉన్నారని పవన్ కళ్యాణ్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి తెలిపారు.

 

స్టీల్ ప్లాంట్ చుట్టూ ఉన్న సుమారు లక్ష వరకు ప్రజానీకం స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి జీవిస్తున్నారు కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక్కదాన్ని మాత్రం ప్రైవేట్ పరం చేయవద్దు అని పవన్ కళ్యాణ్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కోరారు. ఈ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చర్చ జరిగినప్పుడు అనేక మంది జీవితాలను ప్రభావితం చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయటానికి ముందు ఆల్టర్నేటివ్ గా మరో ఆలోచన చేయాలని పవన్ కళ్యాణ్ అమిత్ షా ని కోరుతూ ఆంధ్రుల ఆత్మ గౌరవంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయవద్దు అంటూ ప్రజెంటేషన్ కూడా ఇచ్చాము అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

 

అలాగే వైస్సార్సీపీ ఎంపీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడేందుకు కృషి చేయటం లేదు అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పవన్ కళ్యాణ్ తో అరగంటపాటు సమావేశం కాగా.. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఆర్థిక అంశాలు అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు, దేవాలయాల పై జరుగుతున్న దాడుల గురించి కూడా ప్రధానంగా చర్చ జరిగింది అని పవన్ కళ్యాణ్ మీడియా తెలిపారు. అమిత్ షా తో మాట్లాడిన తర్వాత స్టీల్ ప్లాంట్ పై ఖచ్చితమైన క్లారిటీ తనకు వచ్చిందని పవన్కళ్యాణ్ చెబుతున్నారు. ఈమాట చెబుతూనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీరు ఆపగలం అనుకుంటున్నారా..? అని  అడిగితే, కేంద్రానికి మా మాట చెప్పటం వరకు చెప్పం అటుపై కేంద్రం ఏం చేస్తుంది ఏం చేస్తుందో చూడాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు..

Leave a Reply