Take a fresh look at your lifestyle.

నేడు హైదరాబాద్‌కు అమిత్‌ ‌షా

  • నిర్మల్‌ ‌తెలంగాణ విమోచన ఉత్సవానికి హాజరు
  • వెచ్చి ఉరుల మర్రి వద్ద ప్రత్యేక సభ…భారీ ఏర్పాట్లు

కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన హాజరుకానున్న నిర్మల్‌లో శుక్రవారం మధ్యాహ్నం 12 గంలకు జరగనున్న భారీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు చేస్తుంది. సభ ముఖ్య అతిథిగా అమిత్‌ ‌షా హాజరవుతున్నారు. సెప్టెంబర్‌ 17‌ను అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌తో బీజేపీ ఈ సభ నిర్వహిస్తుంది. అమిత్‌ ‌షా హాజరుకానున్న నేపధ్యంలో నిర్మల్‌ ‌సభను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. కనీసం లక్షమందికి తగ్గకుండా సభ నిర్వహిస్తామని కమలనాథులు చెబుతున్నారు. అన్ని నియోజకవర్గాల కార్యకర్తలు అమిత్‌ ‌షా సభకు హాజరయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. కాగా రేపు కాంగ్రెస్‌ ‌సభ ఉండటంతో నిర్మల్‌ ‌సభపై బీజేపీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

అమిత్‌ ‌షా బేగంపేట్‌ ‌లేదా నాందేడ్‌ ‌నుంచి నిర్మల్‌ ‌సభకు వెళ్ళనున్నారు. నిర్మల్‌ ‌ప్రాంతం సాహసోపేతమైన వీరుల పోరాటానికి, వారి అసమాన త్యాగాలకు ఓ నిదర్శనం. జలియన్‌వాలాబాగ్‌ ‌ఘటన కంటే ఏళ్ల ముందే.. అంతకంటే దారుణమైన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. ఒకే మర్రి చెట్టుకు వెయ్యి మందిని ఉరి తీశారు. 17న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నిర్మల్‌కు రానున్న నేపథ్యంలో మరోసారి ఇక్కడి చరిత్ర వెలుగులోకి వొస్తున్నది.

2007 నవంబర్‌ 14‌న వెయ్యి ఉరుల మర్రి సవి•పంలో ఓ స్థూపాన్ని, 2008 నవంబర్‌ 14‌న నిర్మల్‌లోని చైన్‌గేట్‌ ‌వద్ద రాంజీ గోండు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించేందుకు అమిత్‌ ‌షా నిర్మల్‌ ‌రానుండటంతో దీనికి ప్రాధాన్యత చేకూరింది.

Leave a Reply