Take a fresh look at your lifestyle.

ఉ‌ద్రిక్తత నడుమ నేరేడుచర్ల ‘పుర’ చైర్మన్‌ ఎన్నిక

neredmet chairman selection
ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు
  • ప్రమాణ స్వీకారాన్ని వాకౌట్‌ ‌చేసిన కాంగ్రెస్‌ ‌పార్టీ సభ్యులు
  • చైర్మన్‌గా చందమల్ల జయబాబు, వైస్‌ ‌చైర్‌పర్సన్‌గా చల్లా శ్రీలత
  • ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేవీపీలు అరెస్టు, రోడ్డుపై ధర్నా చేపట్టిన కార్యకర్తలు
  • అక్రమ పద్దతిలో నేరేడుచర్ల మున్సిపల్‌ ‌చైర్మన్‌ ఎన్నిక : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  • పట్టణంలో భారీగా మోహరించిన పోలీసులు

మంగళవారం జరిగిన నేరేడుచర్ల మున్సిపల్‌ ‌చైర్మన్‌, ‌వైస్‌ ‌చైర్‌పర్సన్‌ల ఎన్నికల ఉద్రిక్తత నడమ కొనసాగింది.ముందుగా టిఆర్‌ఎస్‌ ‌సభ్యులతో అధికారు లు ప్రమాణాస్వీకారం చేయించారు. కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన సభ్యులు నిన్నటి పద్దతిలో ఎన్నిక నిర్వహించా లని, లేకుంటే వాయిదా వేయాలని ప్రమాణాస్వీకారం చేయకుండానే వాకౌట్‌ ‌చేశారు. దీంతో అధికారులు చైర్మన్‌, ‌వైస్‌ ‌చైర్‌పర్సన్‌ను ప్రకటించారు. చైర్మన్‌గా చందమల్ల జయబాబు, వైస్‌ ‌చైర్‌పర్సన్‌గా చల్లా శ్రీలతా రెడ్డిలతో ప్రమాణాస్వీకారం చేయించారు. సిపిఎం మద్దతు ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీకి ఎక్స్ అఫిషియో సభ్యులైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు కేవీపీ రామచందర్‌రావు ఓటు చేయాలని భావించారు. దీంతో అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన 7 కౌన్సిల్‌ ‌సభ్యులు, 4 ఎక్స్ అఫిషియో ఓట్లతో మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌ఫీఠాన్ని దక్కించుకుంది.

 

దీనిని నిరసిస్తూ టిపిసిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచందర్‌రావులతో కలిసి రోడ్డుపై బైటాయించి ఆందోళన చేపట్టారు. నిన్నటి జాబితా ప్రకారమే చైర్మన్‌ ఎన్నిక నిర్వహించాని, లేదంటే ఎన్నికను వాయిదా వేయాలని డిమాండ్‌ ‌చేశారు. దీంతో కొంత ఉద్రిక్తత వాతావరణం ఏర్పడడంతో పోలీసులు వారిని అరెస్టులు చేసి మిర్యాలగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నిర్వాహణ అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి అక్రమ పద్దతిలో చైర్మన్‌ ఎన్నికల నిర్వహించారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ‌పార్టీకి బలం ఉన్నప్పటికి రాజ్యాంగానికి విరుద్దంగా అధికారులు వ్యవహరించడం హేయమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు డబ్బుతో రాజకీయం చేస్తున్నారని, ప్రజల మద్దతు కాంగ్రెస్‌ ‌వైపే ఉందన్నారు. పట్టణంలో ఏలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్‌ అమలు ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సుమారు 100 పోలీసు బందోబస్తుతో దుకాణాలను మూసివేయించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply