*హెచ్డీఎఫ్సీ కార్డ్ ఖాతాదారులకు 10% తక్షణ రాయితీ
*ప్రైమ్ సభ్యులకు అక్టోబర్ 16 నుంచి అమ్మకాలు
ఈ సంవత్సరారంభంలో భారతదేశపు మార్కెట్లో ప్రవేశించిన వైట్–వెస్టింగ్‌హౌస్ తమ శ్రేణి సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లపై భారీ రాయితీలను ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకాలలో భాగంగా అక్టోబర్ 17,2020వ తేదీ నుంచి ఇవి 7,299 రూపాయలకు లభించనున్నాయి. ఈ అమ్మకాల ద్వారా 2020–21 ఆర్థిక సంవత్సరంలో 2% మార్కెట్ వాటా సొంతం చేసుకోవాలని లక్ష్యంగా చేసుకుంది.
అతి తక్కువగా తమ 7కేజీ వాషింగ్ మెషీన్‌ను 7299 రూపాయలు ; 8కేజీ కోసం 8799 రూపాయలు ; 9కేజీ ల సెమీ ఆటోమేటిక్ ప్రీమియం వాషింగ్ మెషీన్లను 9799 రూపాయలకు అందించనున్నారు.ఈ పండుగ సీజన్‌పై భారీ అంచనాలను వైట్ వెస్టింగ్‌హౌస్ పెట్టుకుంది. దీనిలో భాగంగా అక్టోబర్16,2020 వ తేదీ నుంచి హెచ్డీఎఫ్సీ కార్డు దారులు 10% తక్షణ రాయితీ పొందగలరు.
రాబోతున్న పండుగ సీజన్, కొరోనా మహమ్మారి కారణంగా ఈ–కామర్స్ రంగంలో వృద్ధి చెందనున్న మార్కెట్ గురించి శ్రీమతి పల్లవి సింగ్, సీనియర్ వైస్‌ప్రెసిడెంట్, ఎస్పీపీఎల్ ఇండియా బ్రాండ్ లైసెన్సీ, వైట్ వెస్టింగ్‌హౌస్ మాట్లాడుతూ ‘‘వినియోగదారులు మరియు గృహ అప్లయెన్సెస్ విభాగంలో అమ్మకాలు సానుకూలంగా ఉన్నాయి. స్వచ్ఛత మరియు పొదుపు అనే అంశాలకు వినియోగదారులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కోవిడ్ ముందు నాటి రీతిలో డిమాండ్‌ను మేము చూస్తున్నాం. మా అందుబాటు ధరలలోని ప్రీమియం వాషింగ్ మెషీన్లు వినియోగదారులకు స్వచ్ఛతా పరిష్కారాలను అందించడమే కాదు, అందుబాటు ధరలలో అవి లభించనున్నాయి. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో మేము కూడా భాగం కావడంతో పాటుగా వినియోగదారులకు ప్రయోజనం కల్పించనుండటం పట్ల సంతోషంగా ఉన్నాం. ప్రజలకు అందుబాటు ధరలో ఉన్న బ్రాండ్‌గా డబ్ల్యుడబ్ల్యుహెచ్ రాబోయే రెండేళ్లలో 3% మార్కెట్ వాటాను పొందాలని లక్ష్యంగా చేసుకుంది. వాషింగ్ మెషీన్ విభాగం పట్ల మేము ఆశాజనకంగా ఉన్నాం. మరిన్ని ఉత్పత్తులను త్వరలో జోడించనున్నాం’’ అని అన్నారు. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన అమెరికన్ కన్స్యూమర్ అప్లయెన్సెస్ బ్రాండ్ వైట్ వెస్టింగ్‌హౌస్. ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా 45కు పైగా దేశాలలో విక్రయాలు జరుపుతుంది.