Take a fresh look at your lifestyle.

రామప్పను సందర్శించిన అమెరికా దేశస్థుడు

రామప్పను సందర్శించిన అమెరికా దేశస్థుడు
వెంకటాపూర్ ,ప్రజాతంత్ర, నవంబర్ 13:
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని ఆదివారం అమెరికా దేశస్థుడు మిరిగ్రమ్ సందర్శించారు. అర్చకులు  అమెరికా దేశస్థున్ని  సాదరంగా స్వాగతం పలుకగా రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం టూరిజం గైడ్ లు గోరంట్ల విజయకుమార్, తాడబోయిన వెంకటేశ్ ల నుంచి రామప్ప విశేషాలను తెలుసుకున్నారు.
-సందర్శకులతో కళకళలాడిన రామప్ప
 ఆదివారం  రామప్ప దేవాలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత రామప్ప దేవాలయానికి సందర్శకుల తాకిడి పెరుగుతోంది . ఆదివారాల్లో వేలాదిగా తరలివస్తున్న పర్యాటకులు ఆలయ అందాలను చూసి ముగ్ధులు అవుతున్నారు. రామప్ప సరస్సులో బోటు షికారు చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.

Leave a Reply