Take a fresh look at your lifestyle.

వ్యవసాయ సంస్కరణలకు అమెరికా స్వాగతం ..!

  • విభేదాలను చర్చ ద్వారా పరిష్కరించు కోవాలని సలహా
  • అధిక ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే చర్యలు అంటూ కితాబు

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ: భారత దేశములో నిరసనకు గురి అవుతున్న వ్యవసాయ సంస్కరణలను అమెరికా స్వాగతించింది. శాంతియుత నిరసనలు ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య లక్షణం అని అమెరికా ప్రకటించింది. ఢిల్లీ సరిహద్దు వెంబడి జరుగుతున్న నిరసన ప్రదేశాలలో ఇంటర్నెట్ ఆంక్షలను అమెరికా అడ్మినిస్ట్రేషన్ గుర్తించిందని అమెరికా ప్రకటించింది. అనేక రౌండ్ల చర్చల తరువాత కూడా భారత ప్రభుత్వం మరియు రైతుల మధ్య చర్చలు ఇప్పటికీ సఫలం కాకపోవటం స్తంభించినందున యుఎస్ అడ్మినిస్ట్రేషన్ నేతృత్వంలో ప్రభుత్వం రైతుల మధ్య విభేదాలను చర్చ ద్వారా పరిష్కరించుకోటానికి ప్రోత్సహిస్తుంది అని అమెరికా అధ్యక్షుడు జోయ్ బైడాన్ అన్నారు.

యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా “భారతదేశ మార్కెట్ల సామర్థ్యాన్ని మెరుగుపరిచే ..అధిక ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే చర్యలు భారత్ లో జరుగుతున్నాయి దీన్ని అమెరికా స్వాగతిస్తుంది” అని భారత్ లోని అమెరికా రాయబారకరాలయం తెలిపింది. ఢిల్లీ సరిహద్దు వెంబడి జరుగుతున్న నిరసన ప్రదేశాలలో ఇంటర్నెట్ ఆంక్షలపై,యుఎస్ అడ్మినిస్ట్రేషన్ మాట్లాడుతూ ఇంటర్నెట్‌తో సహా అడ్డంకి లేని భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రాథమికమైనది అంతేకాదు అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్యం లక్షణం అని గుర్తించిందని చెప్పారు. ప్రశ్నలకు సమాధానంగా యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఈ వ్యాఖ్యలు చేసింది, ఢిల్లీలోని యుఎస్ ఎంబసీ ప్రతినిధి గురువారం పై వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు.

అమెరికా అడ్మినిస్ట్రేషన్ ప్రకటనపై మొదట ఢిల్లీ అస్ ఎంబసీ ఎటువంటి స్పందన ఇవ్వలేదు అయితే, పాప్ ఐకాన్ రిహన్న, టీనేజ్ క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బెర్గ్,యుఎస్ వైస్ ప్రెసిడెంట్ మేనకోడలు న్యాయవాది రచయిత మీనా హారిస్ ట్వీట్లను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తన అధికారిక ప్రకటనలో ప్రస్తావిస్తూ ఇటువంటి విషయాలపై వ్యాఖ్యానించే ముందు, వాస్తవాలను నిర్ధారించుకోమని భారత్ కోరుతున్నది, ఇక్కడి సమస్యలపై సరైన అవగాహన ఏర్పరుచుకోవాలి.

సంచలనాత్మక సోషల్ మీడియా హ్యాష్‌ట్యాగ్‌ల వ్యాఖ్యలు ప్రముఖులు చేసినప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి అని ప్రకటించింది. వ్యవసాయ చట్టాలను సమర్థిస్తూ, భారత విదేశాంగ శాఖ తన ప్రకటనలో, ఈ చట్టాలు తీసుకు వచ్చినప్పుడు భారత పార్లమెంట్ పూర్తి చర్చల తరువాత, వ్యవసాయ రంగానికి సంబంధించిన సంస్కరణవాద చట్టాలను ఆమోదించింది అని ఈ సంస్కరణలు భారత్ లో విస్తరించిన మార్కెట్ అందిస్తాయి అని తెలిపింది.

రైతులకు ఎక్కువ సౌలభ్యాన్ని అందించే చట్టాలు అని ఆర్థికంగా.. పర్యావరణ.. పరంగా స్థిరమైన వ్యవసాయానికి మార్గం సుగమం చేస్తారు. చేస్తాయి అని MEA ప్రకటించింది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల చాలా తక్కువ మంది రైతులకు మాత్రమే ఈ సంస్కరణల చట్టాలు గురించి కొంత రిజర్వేషన్లు ఉన్నాయి MEA అని పేర్కొంది.ఈ ప్రకటన తరవాత అమెరికా ప్రభుత్వం భారత దేశంలో రైతుల నిరసనను తక్కువ చేస్తూ భారత ప్రభుత్వానికి మద్దత్తు ప్రకటించింది.

Leave a Reply