Take a fresh look at your lifestyle.

వీధికెక్కిన అగ్రరాజ్య ప్రజాస్వామ్యం డొల్లతనం

అమెరికా కూడా అన్ని దేశాల మాదిరేనని, ఆ దేశానికున్న బలమెంతో, బలహీనతలేమిటో ప్రపంచానికి చాటిచెప్పిన ట్రంప్‌ ‌మహాశయునికి అందరూ కృతజ్ఞతలు చెప్పాల్సిందే. గెలుపు ఓటములు ఎవరివైనా, ఎదుటివారికి ప్రజాస్వామ్యమంటే నీతులు బోధించే ముందు తమను తాము ప్రశ్నించుకుని సరిదిద్దుకోవాలన్న గుణపాఠం అమెరికా నేర్చుకోవాల్సిన అగత్యం చాటిచెప్పినట్లయింది. ఈ అధ్యక్ష ఎన్నికలు అమెరికా బూర్జువా ప్రజాస్వామ్య దివాలాకోరుతనాన్ని ఎత్తి చూపినట్లయింది. 2008 నుంచీ బలహీనపడుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ, 2016 అధ్యక్ష ఎన్నికల అనంతరం అక్కడ ఏర్పడ్డ రాజకీయ పరిణామాలను ప్రతిబింబింపజేస్తున్నాయి.”

ప్రపంచానికి పెద్దన్న, ప్రజాస్వామ్యంలో అగ్రరాజ్యం అని డాంబికాలు పోయిన 170 సంవత్సరాల అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా డొల్లతనం 2020లో బయటపడింది. సాధారణ పౌరుడో, నల్ల జాతీయుడో, భారతదేశంలో విపక్షం నాయకుడో కాదు..సాక్షాత్తు నాలుగేళ్ళపాటు శ్వేతసౌధం నుంచి 50 రాష్ట్రాల అమెరికా దేశానికి అధ్యక్షునిగా మార్గనిర్దేశకం చేసిన డొనార్డ్ ‌ట్రంప్‌ ‌స్వయంగా, ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, వోటర్‌ ‌ఫ్రాడ్‌ ‌జరిగిందనీ ఎలుగెత్తి చాటి న్యాయ స్థానం తలుపుతట్టాడంటే, ప్రజాస్వామ్యం ఎంత మేడిపండో అర్థమవుతున్నది. ఒక పెద్దమనిషి ఎవరైనా అధ్యక్షపదవికి పోటీ చేస్తే అమెరికన్‌ ‌పౌరులు వోటు వేస్తారో లేదో తెలియదు కానీ, అంత పెద్ద మనిషెవరూ అసలు ఎన్నికల్లో పోటీ చేయరన్న విషయం తేలిపోయిందట. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, తన గెలుపు ఖాయమైనప్పటికీ, తన విజయాన్ని తస్కరించారని అభియోగిస్తూ నాలుగేళ్ళుగా అధ్యక్ష స్థానంలో ఉన్న ట్రంప్‌ ‌మహాశయుడే సుప్రీమ్‌ ‌కోర్టుకు వెళ్ళాడంటే, ప్రపంచమే దిగ్భ్రాంతి చెందింది. ప్రపంచంలో ఆ దేశ ప్రజాస్వామ్యం పట్ల భ్రమలన్నీఈ దెబ్బతో తొలగిపోయాయి.
ఎన్నికల పక్రియలో వోటింగ్‌ ‌పట్ల అధ్యక్షుడే అ భియోగాలు చేసాడంటే…ఇప్పటివరకూ అమెరికా పట్ల వ్యతిరేకత పెంచుకుని విమర్శలు కురిపిస్తున్నవారికి ట్రంప్‌ ‌పెడుతున్న గగ్గోలు బలం చేకూర్చినట్లే. ఇప్పుడే కాదు..ఎన్నికల వాతావరణం ఏర్పడిన నాటినుంచీ. రాజకీయ వేదికపై ప్రచార సరళి సాగిన తీరు, ఆరోపణల జోరు అక్కడి వోటర్లకే కాదు..ప్రపంచవ్యాప్తంగా వీక్షకులకు అత్యున్నత గౌరవం ఆపాదించుకున్న ప్రజాస్వామ్యం ఎంతగా దిగజారిందో, ఉపన్యాసాలు, చర్చలు ఎంత వెగటేసాయో చెప్పవచ్చు. అందునా సాక్షాత్తు శ్వేతసౌధంలో అధ్యక్షహోదాలో మకాం చేసిన ట్రంపే అలా మాట్లాడారంటే, ప్రజాస్వామ్యంలో ప్రపంచానికే ఆదర్శనీయంగా కీర్తనలందుకున్న ఘనమైన అమెరికా ప్రజాస్వామ్యం అసలు రంగు బయటపడింది. అమెరికన్లు తలెత్తుకోలేని పరిస్థితి నిజంగా. గెలుపు ఖాయమని నమ్ముతూ, మరోసారి అధ్యక్ష పీఠంపై ఆసీనులవడం ఖాయమనుకున్న తరుణంలో అమెరికన్లకు ఆందోళన కలిగించే విషయమే మరి.
2020 అధ్యక్ష ఎన్నికల వాతావరణం మొదలైన నాటినుంచీ కొన్ని నెలలు ముందుగానే అధ్యక్షుడు ట్రంప్‌, ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం లేదని మొదలెట్టి ఎన్నికల తంతు సాగుతున్నప్పుడు, వోట్ల లెక్కింపు సాగుతున్నప్పుడూ కూడా, వోటింగ్‌లో అక్రమాలు జరిగాయనడం అమెరికా రాజకీయాలు ఎంత అధోగతికి చేరాయో అద్దం పడుతున్నది. ఎన్నికల నిర్వహణ తీరును దుయ్యపడుతున్న ధోరణి గమనిస్తున్న పరిశీలకులు  పోలింగ్‌ అనంతరం ఫలితాలను అంగీకరించడేమోనని భయపడ్దట్లే ఆ దేశపు రాజకీయాలు అనూహ్యంగా మలుపు తిరిగి నిశ్చేష్ఠులయ్యారు.
అమెరికా  ఎన్నికలు అసత్యాలకుప్ప అని  ట్రంప్‌ ‌పేర్కొనడం ఆ దేశపు ప్రజాస్వామ్య కపట రూపాన్ని ప్రపంచానికి తెలియ జేసినట్లయింది. ఇదే వ్యాఖ్యలను ప్రపంచంలోని ఏ దేశపు నాయకుని నోటినుచీ వొచ్చినా అమెరికా ప్రభుత్వం కాని, ప్రసార సాధనాలుకానీ ప్రజాస్వామ్యం మంటకలిసిందని ఎంతగా గొంతు చించుకుని ఉండేవో?
అమెరికా కూడా అన్ని దేశాల మాదిరేనని, ఆ దేశానికున్న బలమెంతో, బలహీనతలేమిటో ప్రపంచానికి చాటిచెప్పిన ట్రంప్‌ ‌మహాశయునికి అందరూ కృతజ్ఞతలు చెప్పాల్సిందే. గెలుపు ఓటములు ఎవరివైనా, ఎదుటివారికి ప్రజాస్వామ్యమంటే నీతులు బోధించే ముందు తమను తాము ప్రశ్నించుకుని సరిదిద్దుకోవాలన్న గుణపాఠం అమెరికా నేర్చుకోవాల్సిన అగత్యం చాటిచెప్పినట్లయింది. ఈ అధ్యక్ష ఎన్నికలు అమెరికా బూర్జువా ప్రజాస్వామ్య దివాలాకోరుతనాన్ని ఎత్తి చూపినట్లయింది. 2008 నుంచీ బలహీనపడుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ, 2016 అధ్యక్ష ఎన్నికల అనంతరం అక్కడ ఏర్పడ్డ రాజకీయ పరిణామాలను ప్రతిబింబింపజేస్తున్నాయి. అంతేకాదు అమెరికా పాలక పక్షంలో ఏర్పడ్డ సంక్షోభాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నట్లయింది. నేటి ఈ అధ్యక్ష ఎన్నికలు అసలు స్వరూపాన్ని మరింత బట్టబయలు చేసాయి. ప్రపంచంలోనే అన్నింటా అగ్రస్థాయి అని గర్వపడుతున్న ఆ దేశానికి నిజంగా ఎంత తలవొంపులు.
– శ్యామ్‌

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply