Take a fresh look at your lifestyle.

ఆమె ఎన్నో…

ఆమె దాగేకొద్ది
ఆ పరిచయానికి రుచెక్కువ.
గొంతు దూరమయ్యేకొద్ది
ఆ మాటలకు మత్తు ఎక్కువ.

ఆమెలో మునిగేకొద్దీ
ఆ లోతుకు దాహమెక్కువ.
కాలం గడిచేకొద్దు
ఆ జ్ఞాపకాలకు జీవమెక్కువ.

ఆమెను చెప్పుకునేటప్పుడు
మనసుకు వేగమెక్కువ
తప్పుకుపోయేటప్పుడు
ఆ బంధానికి భారమెక్కువ.

ఆమెకు పంచేటపుడు
భావాలకు భాధ్యతేక్కువ.
పక్కనేఉన్నప్పుడు
ఆ రోజంతా తీపెక్కువ.

ఆమెను వ్రాసుకునేటప్పుడు
కవితకు ఊహాలెక్కువ.
స్పందించినప్పుడు
నా మనసులో సందడెక్కువ.

అమెను తలచుకునేటప్పుడు
కాలానికి పరుగెక్కువ.
ఎదుటకొచ్చినప్పుడు
ఏది గుర్తుకురాని మరుపెక్కువ.
    – శ్రీ సాహితి, 9704437247

Leave a Reply