Take a fresh look at your lifestyle.

రాజ్యాంగ నిర్మాతకు, తెలంగాణ బాంధవునికి పూలవర్షం… నీరాజనాలు…!

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అం‌బేద్కర్‌ ‌దేశంలో అస్పృశ్యత నిర్మూలన కోసం మహోద్యమాన్నే చేపట్టి దేశ వ్యాప్తంగా వున్న దళితుల్లో సాంఘిక, విద్య, రాజకీయ చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి. ముఖ్యంగా భారత జాతీయ సాంఘికోద్యమ చరిత్రలో డాక్టర్‌ అం‌బేద్కర్‌కి విశిష్టమైన స్థానం ఉంది. సమాజంలో మనిషికి, మనిషికి మధ్య ఉన్న తేడాలను రూపుమాపి, సర్వసమానత్వం కోసం కృషిచేసిన కారణజన్ముడు. చిన్నతనం నుంచే తెలివైన విద్యార్ధిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ క్రాంతదర్శి జన్మించి 132 సంవత్సరాలు పర్తయినాయి. అయితే సమాజ అభివృద్ధికోసం ఎవరైతే తమ జీవితాలను అర్పిస్తారో వారిని మాత్రమే ఎల్లప్పుడూ సమాజం గుర్తుపెట్టుకుంటుంది. లోక్‌ ‌నాయక్‌ అం‌దించిన సేవలకు కృతజ్ఞతాభావ స్ఫురణతో అయన అభిమానించిన ఆశయాల సాధనకు, చైతన్యదీప్తికి అంకితమై ఆర్థిక అసమానతలు లేని రాజ్యం నిర్మించుటకు మన ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌దళితబంధు, రైతుబంధు లాంటి పథకాలు ప్రవేశపెట్టి 80 శాతం ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచారు. ఆయన ఒక విరాట్‌ ‌పురుషుడు. ఇంద్రధనుస్సును ఎన్నిరంగులో.. అంబేద్కర్‌ ‌మేధస్సుకు అన్ని తత్వాలున్నాయి. తెలంగాణను నెంబర్‌ ‌వన్‌గా నిలిపేందుకు విద్య, హ్యూమన్‌ ‌క్యాపిటల్‌, ‌ప్రజాస్వామ్యం, సామజిక న్యాయం , ఆర్థిక ప్రణాళిక లాంటి అంశాలపై కేసీఆర్‌ అం‌బేద్కర్‌ ‌బాటలో పయనించడం వల్లే అది సాధ్యమైందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఏటా అంబేద్కర్‌ ‌పేరిట అవార్డు ఇవ్వడం కోసం 51కోట్లతో నిధి ఏర్పాటు చేసినట్లు ప్రకటించి కెసిఆర్‌ ‌తన దార్శనికతను చాటుకున్నారు. అందుకే ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త,  నోబెల్‌ ‌బహుమతి అవార్డు గ్రహీత అమర్థ్యసేన్‌ అం‌బేద్కర్‌ను తన గురువుగా, తండ్రిగా భావించినట్లే…అంబేద్కర్‌పై కేసీఆర్‌కు ఉన్న నమ్మకం పురివిప్పిన నెమలిలా మారనుంది.
నవభారత నిర్మాతల్లో బహుముఖీనమైన ప్రతిభాశాలిగా డా.బాబా సాహెబ్‌ అం‌బేద్కర్‌ ‌ప్రథమ శ్రేణిగణ్యులనడంలో సందేహం లేదు. విద్యావేత్తగా, ధర్మశాస్త్ర పారంగతునిగా, రాజకీయవేత్తగా, పరిపాలనా దక్షునిగా అయన ప్రశస్తి తెలిసిందే. శతాబ్దాలుగా శపితులై అగ్రవర్ణాల అకారణ అణచివేతలకు గురవుతున్న దుఃఖితులైన దళితుల విముక్తికై సర్వతోముఖాభివృద్ధికి యావజ్జీవితం అవిశ్రాంత పోరాటం సలిపిన మహాయోధుడు బాబాసాహెబ్‌. ‌హిందూ సమాజంలో అతినికృష్ట వర్ణవ్యవస్థ దంష్ట్రాల్లో చిక్కి అస్పృశ్యులుగా చేయని అపరాధానికి, యాధృచ్ఛికంగా ఒక వర్గంలో జన్మించిన నేరానికి అలమటిస్తున్న అధోజగత్సహోదారుల అభ్యున్నతికి, ఆత్మగౌరవానికి, సమానత్వ హక్కులకు, ప్రతిపత్తికి అహరహం కఠోర తపస్సు ఆ మహనీయుని జీవితం, కృషి ఇస్తున్న మహత్తర సందేశం. అసాధారణమైన ప్రతికూల వాతావరణంలో దైవలిఖితమన్న కర్మ సిద్ధాంతానికి, ఆత్మన్యూనతా భావానికి ఏమాత్రం ఆస్కారమివ్వకుండా అవకాశాలు, ఆధారం, ప్రోత్సాహం వుంటే జాతి ప్రసక్తి లేకుండా అందరూ ప్రతిభాశేముషీ దురంధరులుగా వికాసమొందడానికి అవసరమైన పరిస్థితులకై ఏ పదవిలో వున్నా, లేకున్నా అకుంఠిత దీక్షాదక్షలతో అయన రాజీలేని పోరాటం సాగించాడు. మానవుల బాధలకు సామాజిక రుగ్మతలు కారణమని,  వాటిని నిర్మలించడానికి పోరాడండి, బోధించండి, సమీకరించండి అనే అంబేద్కర్‌ ‌బోధనలు పుణికిపుచ్చుకున్న నేతగా కేసీఆర్‌ ఆధునిక మానవతావాద , సమానత్వ ఉద్యమాలకు అయన మూర్తిభవించిన నిరంతర సేవా స్ఫూర్తితో అణగారిన ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టిన ఈ తరం మట్టిమనిషి సీఎం కేసీఆర్‌. ఏటా 25 లక్షల మందికి దళితబంధు దేశమంతా అమలు చేసేందుకు ఆకాశమంత ఆశయంతో అడుగులు వేయడం ముదావహం.
విశ్వమానవుడు, ప్రపంచ మేధావి డాక్టర్‌ అం‌బేద్కర్‌ ‌తన దూరదృష్టితో అనేక చర్చల అనంతరం, ప్రత్యేక రాష్ట్రాల కోసం, ఆర్టికల్‌ 3 ‌ని రాజ్యాంగంలో ప్రత్యేక శ్రద్ధతో రూపొందించి పొందుపరచడం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి మార్గం సుగమం అయింది. తెలంగాణ బాంధవుడు, ఒక జాతికి, ఒక ప్రాంతానికి చెందిన కొందరివాడు కాదు, అందరివాడు. డా. బిఆర్‌ అం‌బేద్కర్‌. అదే ఆయన జీవితంలో మహోజ్వల ఘటన. చరిత్రలో శాశ్వతమైన స్థానాన్ని కల్పించి మహత్తరమైన మలుపు రాజ్యాంగ రచనలో హెచ్చుభారాన్ని స్వీకరించి, సర్వసమానత్వం కోసం కృషి చేసి, ముఖ్యంగా దళితుల ఉద్దరణకు పాటు పడిన రాజకీయ విద్యా సాంఘిక రంగాలలో వారికి సమాన హక్కులు కల్పించి వారి పాలిట దైవంగా అవతరించారు. కేసీఆర్‌ ‌తెలంగాణ ఉద్యమం గాంధీజీ అహింస మార్గంలో నడిపించి సాకారం చేసి, డా. బిఆర్‌ అం‌బేద్కర్‌ అట్టడుగు, బడుగు వర్గాలను పైకి తేవాలని పాటుపడినట్లే కేసీఆర్‌ అట్టడుగు వర్గాలకు పెద్దపీఠ వేసి, చేయూతనిచ్చి ఆర్థిక స్వావలంబన కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్‌ ‌వన్‌గా నిలిపారు. ‘నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు…జనంకోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావన్న ఆయన ఆలోచనలు కేసీఆర్‌ ‌సబ్బండ వర్గాలకు అమలు చేయడమే అంబేద్కర్‌కు ఇచ్చిన గౌరవంగా దేశమంతా కొనియాడింది. వాజపేయి తరువాత దేశంలో నాకు జాతీయ నేత ఎవరూ కనిపించలేదు. ఇప్పుడు జాతీయ నాయకులు దేశం కోసం జాతికి అనుగుణంగా పనిచేస్తున్నట్లు కనుచూపుమేరకు అగుపడడం లేదు. ఆ బాధ్యత కేసీఆర్‌ ‌మాత్రమే నిర్వర్తించగలరనే నమ్మకం ప్రకాశ్‌ అం‌బేద్కర్‌ ‌వెలిబుచ్చారు.
కేసీఆర్‌ ‌ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ ‌బాబాసాహెబ్‌ ‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌ ‌విగ్రహాల్లో దేశంలోనే అతి పెద్దది. తెలంగాణ ప్రభుత్వం 125 అడుగుల భారీ లోహ మూర్తి స్థానికంగా ఎవరెస్టు శిఖరమంత ఎత్తున ఠీవిగా నిలిచింది. అంబేద్కర్‌ 132‌వ జయంతి వేళ  ఈనెల 14వ తేదీన ఈ విగ్రహాన్ని దార్శనికుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించారు. దాదాపు 11 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ బృహాత్తరమైన ప్రాజెక్టు అనేక విశేషాల సమూహారంగా రూపుదిద్దుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ ఆలోచన పురుడు పోసుకున్న కార్యరూపం దాల్చడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. ఇంత పెద్ద భారీ విగ్రహ నిర్మాణం సామర్థ్యం దేశీయంగా ఉందా?  లేదా? అని ఒక్కటి నాలుగు సార్లు అలోచించి, చైనాలో విగ్రహ తయారీ సంస్థలను పరిశీలించి, పరిశోధించి, నమూనా రూపకల్పన కోసం టెండర్లను ఆహ్వానించింది. పద్మభూషణం అవార్డు గ్రహీత రామ్‌ ‌వన్‌ ‌జీ సుతార్‌, ఆయన కుమారుడు అనిల్‌ ‌సుతార్లు కలిసి విగ్రహా నమూనాలను ప్రభుత్వం ఆమోదించి, తయారు బాధ్యతను వారికీ అప్పగించింది. 353 టన్నుల ఉక్కు, 111టన్నుల కాంస్యంతో 146 కోట్ల వ్యయంతో ప్రముఖ గుత్తేదార్‌ ‌సంస్థ కేపిసి ప్రయివేట్‌ ‌లిమిటెడ్‌ ‌నిర్మాణ బాధ్యతను చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది. ఏప్రిల్‌ 14‌న అంబేద్కర్‌ ‌జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌, ‌తన మనుమడు ప్రకాశ్‌ అం‌బేద్కర్‌తో కలిసి అంబరమంత  అంబేద్కర్‌ ‌విగ్రహాన్ని ఆవిష్కరించి తన దార్శినికతను చాటుకున్నారు. ఈ భారీ విగ్రహం హైదరాబాద్‌కు మణిహారంగా నిలిచింది. ఈ విగ్రహం 45అడుగుల వెడల్పు, 50అడుగుల ఎత్తుతో పార్లమెంటు ఆకృతిలో నెక్లెస్‌ ‌రోడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజకీయాలకోసం అంబేద్కర్‌ ‌భజన చేసే పార్టీలను చుసినాం, కానీ అంబేద్కర్‌ ‌కోరుకున్న జాతికి గౌరవం ఇచ్చే విధంగా కేసీఆర్‌ ‌భారీ విగ్రహ ప్రతిష్ట నిజమైన శ్రద్ధాంజలి. జై భీమ్‌ .. ‌జై కేసీఆర్‌ ‌నినాదం మిన్నంటింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌ 125 అడుగుల విగ్రహం పెట్టినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు వెల్లువెత్తడం అనిర్వచనీయం.

image.png

డా।। సంగాని మల్లేశ్వర్‌
జర్నలిజం విభాగాధిపతి,

కాకతీయ విశ్వవిద్యాలయం,

వరంగల్‌, 9866255355

Leave a Reply