Take a fresh look at your lifestyle.

టిడిపికి పుట్టగతులు లేకుండా పోయాయి

  • టీడీపీ జ్యోతిని ఆర్పేందుకు చంద్రబాబు కంకణం
  • ఇవాళ ఎన్నికల బహిష్కరణ..రేపు పార్టీ మూత
  • చంద్రబాబు నిర్ణయంపై మండిపడ్డ అంబటి

ఆంధప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పుట్టగతులు లేకుండా పోయిందని వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ జ్యోతిని ఆర్పేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని చెప్పారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించారు అని పేర్కొన్నారు. ఓటమికి భయపడేవాడు రాజకీయ నాయకుడు కాదు అని వివరించారు. ఆగిపోయిన ఎన్నికల పక్రియను.. ప్రారంభిస్తే తప్పేంటి? అంబటి రాంబాబు ప్రశ్నించారు… ఆంధప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పుట్టగతులు లేకుండా పోయిందని వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

టీడీపీ జ్యోతిని ఆర్పేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని చెప్పారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించారని పేర్కొన్నారు. ఓటమికి భయపడేవాడు రాజకీయ నాయకుడు కాదని అన్నారు. ఆగిపోయిన ఎన్నికల పక్రియను.. ప్రారంభిస్తే తప్పేంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. నిమ్మగడ్డ ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఎందుకు అడగలేదని నిలదీశారు. చంద్రబాబు ఏనాడూ ఒంటరిగా అధికారంలోకి రాలేదని గుర్తుచేశారు. రేపు అసెంబ్లీ, పార్లమెంట్‌కు కూడా అభ్యర్థులు దొరకరని చంద్రబాబు త్వరలో పార్టీని కూడా రద్దు చేస్తారని ఎద్దేవా చేశారు. నువ్వు రాజకీయ నాయకుడివి కాదు.. పిరికివాడివి అంటూ మండి పడ్డారు.

తిరుపతిలో కూడా పోటీ విరమించుకుంటారా అని ప్రశ్నించారు. వెన్నుపోటు ద్వారా రాజ్యాధికారం సాధించారు.. ఎన్నికలకు వెళ్లినా.. గెలిచేటట్టు లేదు చంద్రబాబుకు తెలిసే ఈ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు అని అంబటి రాంబాబు అన్నారు. పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ఘాటుగా స్పందించారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు… తాడేపల్లిలో మిడియాతో మాట్లాడిన ఆయన.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు బహిష్కరిం చాలని టీడీపీ నిర్ణయించింది.. కానీ, గత ఏడాది ఎన్నికలను రాజకీయ పక్షాలతో సంప్రదించకుండా అర్దాంతరంగా ఆపేసినప్పుడు ఎందుకు మాట్లాడ లేదు? పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు ఎందుకు బహిష్కరించలేదు? అని ప్రశ్నించారు.

ఇక, పంచాయతీ ఎన్నికల్లో మేం గెలిచాం.. అయినా టపాసులు కాల్చారన్న అంబటి.. అప్పుడు నిమ్మగడ్డ రమేష్‌ ‌కుమార్‌ ఎన్నికల్లో సహకరిస్తారనే ఎన్నికల పెట్టలంటూ అప్పుడు గోల పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు ఇప్పుడు ఓటమి భయంతోనే పారిపోతున్నారని ఎద్దేవా చేశారు అంబటిరాంబాబు.. అంపశయ్య మిద నుంచి టీడీపీని దహన సంస్కారాలు చేస్తున్నారని కామెంట్‌ ‌చేసిన ఆయన.. ఓటమి భయంతో పారిపోయే వాడు నాయకుడు ఎలా అవుతాడు? అని ప్రశ్నించారు.

చంద్రబాబు వెన్నుపోటు ద్వారానో, ఏదో ఒక పార్టీ సహకారంతోనో రాజ్యాధికారం సాధించారని వ్యాఖ్యానించిన వైసీపీ ఎమ్మెల్యే.. ఇప్పుడు ఒంటరిగా ఎన్నికలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు పారిపోయారంటూ సెటైర్లు వేశారు.. ఇవాళ ఎన్నికలు బహిష్కరించిన చంద్రబాబు.. రేపు పార్టీని కూడా రద్దు చేస్తారని కామెంట్‌ ‌చేసిన ఆయన.. మరోవైపు లోకేష్‌ ‌ముఖ్యమంత్రిపై మూడు హెచ్చరికలు జారీ చేస్తాడట.. బుడ్డోడు.. బుడ్డోడిలా ఉండాలి.. కానీ, ముఖ్యమంత్రిపై హెచ్చరికలు జారీ చేసే స్థాయి ఉందా? అంటూ ఫైర్‌ అయ్యారు.

Leave a Reply