Take a fresh look at your lifestyle.

మహారాష్ట్రకు కోశ్యారీ స్థానంలో అమరీందర్‌ ‌సింగ్‌ ?

కొత్త గవర్నర్‌ ‌కోసం కసరత్తు చేస్తున్న కేంద్రం
న్యూ దిల్లీ, జనవరి 27 : మహారాష్ట్ర గవర్నర్‌ ‌బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఇటీవల భగత్‌సింగ్‌ ‌కోశ్యారీ ప్రకటించిన నేపథ్యంలో ఆ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో మహారాష్ట్ర నూతన గవర్నర్‌గా పంజాబ్‌ ‌మాజీ సీఎం, బీజేపీ నేత  కెప్టెన్‌  అమరీందర్‌ ‌సింగ్‌ను నియమించాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సుదీర్ఘ కాలంపాటు కాంగ్రెస్‌లో కొనసాగిన అమరీందర్‌ ‌సింగ్‌…‌గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి పంజాబ్‌ ‌లోక్‌ ‌కాంగ్రెస్‌ అనే కొత్త పార్టీని స్థాపించారు.

ఆ ఎన్నికల్లో అమరీందర్‌ ‌సింగ్‌తో పాటుగా ఆయన పార్టీ కూడా ఘోరంగా ఓడిపోయింది. అనంతరం బీజేపీలో చేరిన ఆయన తన పార్టీని కూడా బీజేపీలో వీలినం చేశారు. మరోవైపు మహారాష్ట్ర గవర్నర్‌గా సెప్టెంబర్‌ 2019‌లో బాధ్యతలు చేపట్టిన కోశ్యారీ అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. ఛత్రపతి శివాజీపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దూమారాన్ని లేపాయి. ఇటీవల ఆయన పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు.

Leave a Reply