Take a fresh look at your lifestyle.

ధాన్యం అమ్మకం కోసం నిత్యం ఎదురుచూపులే

  • కొనుగోలు కేంద్రాల్లో రైతుల పడిగాపులు
  • తేమ పేరుతో దోపిడీ చేస్తున్నా పట్టించుకోని వైనం
  • అకాల వర్షాలతో ధాన్యం తడుస్తుండడంపై మరింత ఆందోళన
  • ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారమే కొనుగోళ్లకు అంగీకారం

ధాన్యం కొనుగోలు మొదలుపెట్టి దాదాపు నెలరోజులవుతున్నా ఇప్పటి వరకు రైతులు తమ ధాన్యం సాఫీగా లమ్ముకోవడానికి వీలు లేకుండా పోయింది. ప్రతిరోజూ భారీగానే ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నా కేంద్రాలకు వొస్తున్న ధాన్యం ఎక్కువగా ఉంటుండడంతో రైతులకు ఇబ్బందులు తొలగడం లేదు. దీనికితోడు అకాల వర్షాలతో అన్నదాతలు మరింత ఆందోళన చెందుతున్నారు. కల్లాల్లో ధాన్యం పెద్ద ఎత్తున తడిసిపోతున్నా దీనిపై ఎలాంటి హావి• రావడం లేదు. అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా తగినంత మందిని నియమించకపోవడం, వాహనాలు, హమాలీలను సమకూర్చకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  ప్రతి కొనుగోలు కేంద్రం పరిధిలో వేలాది మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం కొనుగోలుకు అవకాశం ఇచ్చినా తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

కొన్ని సహకార సొసైటీల పరిధిలో మిల్లులను కేటాయించకపోవడం వల్ల తరలింపునకు సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో జిల్లాల్లో ధాన్యం అమ్మకాలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినా రైతులకు నిరీక్షణ తప్పడంలేదు. రోజుల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల వద్దనే ఉండాల్సి వొస్త్తుంది. అకాల వర్షాలను తట్టుకుంటూనే ధాన్యం అమ్మకాలు చేస్తున్నా ధాన్యాన్ని వెంటనే తరలించకపోవడం వల్ల ప్రతీ రైతు 20 నుంచి 25 రోజుల పాటు కొనుగోలు కేంద్రాల్లోనే ఉండాల్సి వొస్తుంది. ప్రభుత్వం చివరి గింజవరకు కొంటామని హావి• ఇస్తున్నా కొనుగోలు వ్యవహారాలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

రైతుల నుంచి నిత్యం ధాన్యం కొనుగోలు చేస్తునా ఇంకా వేలాది మంది రైతులు కొనుగోలు కేంద్రాల వద్దనే రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. అలాగే ధాన్యం కనుగోళ్లలో క్వింటాలుకు 4 నుంచి 5 కిలోల తరుగు తీస్తే తప్ప అమ్మకాలు జరగడంలేదు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో తేమశాతం 17లోపు ఉన్నవాటికి క్వింటాలుకు ఏ గ్రేడ్‌ 1960 ‌రూపాయలు, బీ గ్రేడ్‌కు 1940 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం అమ్మినా పది రోజుల పాటు రైతులు కుప్పల వద్దనే కావాలి ఉంటే తప్ప ధాన్యాన్ని తరలించడంలేదు. మిల్లులకు వెళ్లిన తర్వాత ధాన్యం తేమగా ఉంది, తాలు, మట్టి ఉందని మరో 2కిలోల వరకు తీస్తున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడుస్తుండడంతో క్వింటాలుకు 5కిలోల వరకు నష్టం జరిగినా రైతులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ధాన్యం అమ్మిన రైతులకు త్వరగా డబ్బులు రావడంలేదు. రోజుల తరబడి డబ్బుల కోసం వేచిచూడాల్సి వొస్త్తుంది. సహకార సొసైటీల పరిధిలో ట్యాబ్‌ ఎం‌ట్రీ సకాలంలో చేయకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సాప్ట్‌వేర్‌లో మార్పులు చేయడం, ఆధార్‌కు రైతుల ఫోన్‌ ‌నంబర్‌లు అనుసంధానం కాకపోవడం వల్ల ట్యాబ్‌ ఎం‌ట్రీ ఆలస్యం కావడంతో చెల్లింపులు కావడంలేదు.

ధాన్యం కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎఫ్‌సీఐ నిబంధనలు పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తీసుకొనేందుకు నిరాకరిస్తుంది. నాణ్యమైన ధాన్యం తీసుకొస్తే ఎలాంటి ఆలస్యం చేయకుండా కొనుగోలు చేస్తారు. నిబంధనలు పాటించకుండా ధాన్యం కొనడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించడం వల్ల లాభం లేదు. రైతులు తమ ఫోన్‌ ‌నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకున్న తర్వాతే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి. కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించే సమయంలో ఓటీపీ కోసం ఫోన్‌ను రైతు వద్దే ఉంచుకోవాలి. ఓటీపీ వొచ్చిన తర్వాతే ధాన్యం కొనుగోలు పక్రియ ప్రారంభమవుతుంది. ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌ ‌పుస్తకం, బ్యాంక్‌ ‌పాస్‌ ‌పుస్తకం కచ్చితంగా ఉండాలి.

Leave a Reply